News June 5, 2024
GET READY: ఉదయం 10 గంటలకు ‘కల్కి’ అప్డేట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ‘కల్కి’ సినిమా నుంచి ఉదయం 10 గంటలకు అప్డేట్ రానుంది. ట్రైలర్ రిలీజ్కు సంబంధించి మేకర్స్ అప్డేట్ ఇవ్వనున్నారు. అయితే, ఈనెల 7న గ్రాండ్గా ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే రిలీజైన టీజర్, బుజ్జి గ్లింప్స్ వీడియో సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే.
Similar News
News October 31, 2025
సుశాంత్ను ఇద్దరు కలిసి చంపారు: సోదరి శ్వేతా సింగ్

2020లో జరిగిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణంపై సోదరి శ్వేతా సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ది ఆత్మహత్య కాదని, ఇద్దరు కలిసి హత్య చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని US, ముంబైలోని ఇద్దరు సైకిక్స్ వేర్వేరుగా తనకు చెప్పారన్నారు. ‘సుశాంత్ బెడ్, ఫ్యాన్ మధ్య దూరాన్ని బట్టి అతను ఉరేసుకుని చనిపోయే అవకాశమే లేదు. మెడపై దుపట్టా మార్క్ కాకుండా ఒక చిన్న చెయిన్ ముద్ర మాత్రమే కనిపించింది’ అని పేర్కొన్నారు.
News October 31, 2025
గడువులోగా అమరావతి పనులు పూర్తి కావాలి: CBN

AP: రాజధాని అమరావతి పనులను నిర్దేశించిన సమయానికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పనుల్లో వేగం పెంచాలని, అదే సమయంలో నాణ్యతలో ఎక్కడా రాజీపడరాదని స్పష్టం చేశారు. సీఆర్డీఏ ప్రాజెక్టులపై మంత్రి నారాయణ, అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. రాజధాని పరిధిలో ఇప్పటివరకు చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.
News October 31, 2025
5 కేజీల భారీ నిమ్మకాయలను పండిస్తున్న రైతు

నిమ్మకాయ బాగా పెరిగితే కోడిగుడ్డు సైజులో ఉంటుంది. అయితే కర్నాటకలోని కొడుగు జిల్లా పలిబెట్టకు చెందిన విజు సుబ్రమణి అనే రైతు భారీ నిమ్మకాయలను పండిస్తున్నారు. ఇవి ఒక్కోటి పెద్ద సైజులో 5 కేజీల వరకు బరువు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం మైసూరు వెళ్లినప్పుడు అక్కడ మార్కెట్లో నిమ్మ విత్తనాలను కొని తన కాఫీ తోటలో సుబ్రమణి నాటారు. మూడేళ్ల తర్వాత నుంచి వాటిలో 2 మొక్కలకు ఈ భారీ సైజు నిమ్మకాయలు కాస్తున్నాయి.


