News February 28, 2025

GET READY: రేపు 11AM గంటలకు ‘కన్నప్ప’ టీజర్

image

మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ‘కన్నప్ప’ సినిమా టీజర్ రేపు విడుదల కానుంది. మార్చి 1వ తేదీన ఉదయం 11 గంటలకు టీజర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే రిలీజైన ‘శివ శివ శంకరా’ సాంగ్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ‘టీజర్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మంచు మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న విడుదలవనుంది.

Similar News

News January 8, 2026

ప.గో: యువకుడి ఆత్మహత్య

image

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం ఉండిలో చోటుచేసుంది. ఉండి శివారు ఉప్పగుంట వద్ద చేపల చెరువు వద్ద పనిచేస్తున్న దీప్ జ్యోతి బాస్మతి (21) చెరువు గట్టు మీద ఉన్న రేకుల షెడ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత కాలంగా మృతుడు తన తండ్రి సుకుమార్‌తో కలిసి ఉండిలో ఓ చేపలచెరువు వద్ద పనిచేస్తున్నాడు. మృతుడు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు SI నసీరుల్లా తెలిపారు.

News January 8, 2026

IREDAలో అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్

image

ఇండియన్ రెనెవెబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ (<>IREDA<<>>) 10 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BCom, BCA, డిప్లొమా(CS/IT)అర్హతగల వారు JAN 20 వరకు NATS పోర్టల్‌లో అప్లై చేసుకోవాలి. వయసు 18 -25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.18వేలు, డిప్లొమా హోల్డర్లకు రూ.16వేలు చెల్లిస్తారు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. www.ireda.in

News January 8, 2026

పూజ గదిలో ఉండకూడని దేవుళ్ల చిత్రపటాలు

image

పూజ గదిలో ఉగ్రరూపంలో ఉన్న విగ్రహాలు, చిత్రపటాలు ఉండకూడదు. ఉదాహరణకు.. కాళికాదేవి, మహిషాసుర మర్దిని వంటి రౌద్ర రూపాలు గృహస్థులకు మంచిది కావని శాస్త్రం చెబుతోంది. అలాగే మరణించిన పితృదేవతల ఫొటోలను పూజ గదిలో దేవుడి పటాల మధ్య ఉంచకూడదు. వాటిని దక్షిణ దిశలో వేరుగా ఉంచాలి. ప్రశాంతమైన, ఆశీర్వదించే భంగిమలో ఉన్న దైవ చిత్రాలను మాత్రమే పూజకు ఉపయోగించాలి. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని పండితులు చెబుతారు.