News September 30, 2024
GET READY: ‘రా మచ్చా మచ్చా’ వచ్చేది అప్పుడే!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఈరోజు సెకండ్ సింగిల్ రిలీజ్ కానుంది. ‘రా మచ్చా మచ్చా’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రకటించారు. ఇప్పటికే రిలీజైన ప్రోమో సంగీత ప్రియులకు నచ్చేసింది.
Similar News
News January 10, 2026
మేడారం జాతర.. ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు

TG: మేడారం జాతరలో ఇప్పపువ్వు లడ్డు, బెల్లం లడ్డు ప్రసాదంగా ఇవ్వనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. లడ్డు తయారీ ద్వారా 500 మంది మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఈ నెల 18న CM రేవంత్ మేడారానికి వస్తారని, 19న మొక్కులు చెల్లించి జాతరను లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా జాతరను జరుపుకుందామన్నారు. కాగా ఇప్పపువ్వులో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి.
News January 10, 2026
అమరావతిలో క్వాంటం సెంటర్‌కు టెండర్ ఖరారు

AP: రాజధానిలో క్వాంటం వ్యాలీ నిర్మాణ దిశగా మరో కీలక అడుగు పడింది. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి సంబంధించిన టెండర్‌ను APCRDA ఖరారు చేసింది. రూ.103 కోట్లతో L-1 బిడ్‌గా నిలిచిన ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగిస్తూ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ జారీ చేసింది. ఈ ప్రాజెక్టు నమూనా రూపకల్పన నుంచి నిర్మాణం వరకూ L&Tనే చేపట్టనుంది. సెంటర్ నిర్మాణానికి CRDA నిధుల నుంచి రూ.137 కోట్లు కేటాయించారు.
News January 10, 2026
తిరుపతి SVIMSలో ఉద్యోగాలు

తిరుపతి శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ (<


