News April 5, 2024

GET READY: ‘శ్రీవల్లి’ వచ్చేస్తోంది

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ‘పుష్ప-2’ సినిమా నుంచి అప్డేట్ రానుంది. హీరోయిన్ రష్మిక మందన్న బర్త్ డే సందర్భంగా శ్రీవల్లి ఫస్ట్ లుక్‌‌ను మేకర్స్ రివీల్ చేయనున్నారు. ఉదయం 11.07 గంటలకు శ్రీవల్లి రాబోతోందని మేకర్స్ ప్రకటించారు. దీంతో వెయిటింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News November 19, 2025

లక్కీ డిప్‌కు ఎంతమంది సెలెక్ట్ అవుతారు?

image

తిరుమల శ్రీవారి విశేష సేవల కోసం ప్రతి నెలా దాదాపు 4-5 లక్షల మంది భక్తులు లక్కీ డిప్‌కు దరఖాస్తు చేసుకుంటారు. ఇందులో కేవలం 7,500 నుంచి 8,500 మందికి మాత్రమే సేవల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. వీరు శ్రీవారిని తొలి గడప నుంచి అతి దగ్గరగా దర్శించుకునే అదృష్టాన్ని పొందుతారు. లక్కీ డిప్‌లో ఎంపిక కానివారు, శ్రీవాణి ట్రస్ట్‌కు ₹10 వేలు విరాళం ఇచ్చి కూడా మొదటి గడప దర్శనం ద్వారా శ్రీవారిని వీక్షించవచ్చు.

News November 19, 2025

BOBలో 82 పోస్టులకు నోటిఫికేషన్

image

బ్యాంక్ ఆఫ్ బరోడా(<>BOB<<>>) రిసీవబుల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో 82 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి డిసెంబర్ 9 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PwBD, మహిళలకు రూ.175. వెబ్‌సైట్: https://bankofbaroda.bank.in/

News November 19, 2025

మల్లె కొమ్మ కత్తిరింపులు.. ఈ జాగ్రత్తలతో మేలు

image

మంచి దిగుబడికి మల్లె తోటల పెంపకంలో మొదటి కత్తిరింపు పంట నాటిన ఏడాదికి చేయాలి. ఏటా నవంబర్-డిసెంబర్‌లో పొదను కత్తిరించాలి. కొమ్మలను కత్తిరించడానికి 10 -15 రోజుల ముందు నుంచి నీరు కట్టడం ఆపేయాలి. నవంబర్ చివరి నుంచి జనవరి తొలివారం వరకు కత్తిరింపులు చేస్తే మార్చి నుంచి జులై వరకు పూలు వస్తాయి. ఇలా చేయడం వల్ల మల్లె మొక్కలన్నీ ఒకేసారి పూతకురావు. రైతు ఎక్కువ రోజులు మల్లెను మార్కెటింగ్ చేసి లాభం పొందవచ్చు.