News January 8, 2025

PMతో ప్రత్యేక‌హోదా ప్రకటన చేయించండి: షర్మిల

image

AP: విశాఖ వస్తున్న PM మోదీతో రాష్ట్రానికి ప్రత్యేక‌హోదా ప్రకటన చేయించాలని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల ప్రభుత్వాన్ని కోరారు. ‘చంద్రబాబు గారూ మీరు మోదీ కోసం ఎదురు చూస్తుంటే ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోంది. తిరుపతి వేదికగా రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక‌హోదా అన్నారు. మాటలు కోటలు దాటాయి తప్పిస్తే చేతలకు దిక్కులేదు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదని PMతో పలికించండి’ అని ట్వీట్ చేశారు.

Similar News

News December 10, 2025

మరోసారి ఇండిగో విమానాల రద్దు

image

ఇండిగో విమానాల రద్దు మళ్లీ మొదలైంది. ఇవాళ దేశవ్యాప్తంగా సుమారు 300 సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 137, ముంబైలో 21, బెంగళూరులో 61 ఫ్లైట్స్ నిలిచిపోయాయి. శంషాబాద్ నుంచి బయల్దేరాల్సిన 70 విమానాలు కూడా రద్దయినట్లు తెలుస్తోంది. తీవ్ర సంక్షోభం తర్వాత తమ ఫ్లైట్స్ సర్వీసెస్ సాధారణ స్థితికి చేరాయని నిన్న ఇండిగో సీఈవో పీటర్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే మరోసారి విమాన సర్వీసులు రద్దయ్యాయి.

News December 10, 2025

కుందేళ్ల పెరుగుదలకు మేలైన ఆహారం

image

పుట్టిన 12 రోజుల తర్వాత నుంచి కుందేలు పిల్లలు ఆహారం తింటాయి. కుందేళ్లకు గడ్డితో పాటు దాణాలో మొక్కజొన్న, జొన్న, వేరుశనగ చెక్క, తవుడు, లవణ మిశ్రమాలు తగిన పరిమాణంలో కలిపి మేతగా అందించాలి. లూసర్న్, బెర్సీమ్, నేపియర్, పారాగడ్డి, వేరుశనగ, చిక్కుడు, సోయా, పిల్లిపెసర ఆకులను మేతలో కలిపి ఇవ్వవచ్చు. కుందేళ్లకు ఇచ్చే ఆహారంలో పీచు పదార్థం ఎక్కువ మోతాదులో ఉండేలా చూసుకోవాలి. నీటిని అందుబాటులో ఉంచాలి.

News December 10, 2025

రాష్ట్రంలో పరువు హత్య!

image

TG: హైదరాబాద్ శివారు అమీన్‌పూర్‌లో పరువు హత్య కలకలం రేపింది. బీటెక్ స్టూడెంట్ శ్రవణ్ సాయి ఓ అమ్మాయిని ప్రేమించాడు. అది ఇష్టం లేని యువతి పేరెంట్స్ అతడిని నిన్న హాస్టల్ నుంచి బయటికి తీసుకెళ్లారు. అనంతరం సాయిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని వారే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.