News September 15, 2024
ఏడాదికి ఓసారైనా ఈ పరీక్షలు చేయించండి

ఎంత ఆరోగ్యవంతులైనా ఏడాదికి కనీసం ఒక్కసారైనా కొన్ని టెస్టులు చేయించాలంటున్నారు అపోలో వైద్యుడు డా. సుధీర్ కుమార్. షుగర్, బీపీ టెస్టులే కాకుండా ఎకోకార్డియోగ్రామ్, హీమోగ్లోబిన్, ఈసీజీ, యూరిక్ యాసిడ్, విటమిన్ డీ-బి12, ట్రెడ్మిల్ టెస్ట్, క్రియాటినిన్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ టెస్ట్, చెస్ట్ ఎక్స్రే సహా 20 టెస్టుల్ని చేయిస్తే ముందుగానే పెను సమస్యల్ని గుర్తించొచ్చని ఆయన ట్విటర్లో వివరించారు.
Similar News
News October 21, 2025
ఆక్వా ఎగుమతుల్లో 60% వాటా ఏపీదే: లోకేశ్

AP: ప్రపంచ కొనుగోలుదారులతో రాష్ట్ర ఆక్వా ఎగుమతిదారుల అనుసంధానానికి ట్రేడ్ మిషన్, నెట్వర్కింగ్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేశ్ సీఫుడ్స్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా(SAI)ను కోరారు. కోల్డ్చైన్ మేనేజ్మెంటు, ప్యాకేజింగ్ రంగాల్లో ఆధునిక పరిజ్ఞానం, స్థిరమైన మత్స్యసంపద నిర్వహణకు నైపుణ్యాలు అందించాలన్నారు. ఇండియాలో ఆక్వా ఎగుమతుల్లో ఏపీ వాటా 60% పైగా ఉందని, 2024-25లో ₹66వేల కోట్ల ఎగుమతులు చేసిందని చెప్పారు.
News October 21, 2025
రబీకి అనువైన ఆరుతడి పంటలు – ప్రయోజనాలు

రబీలో వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆవాలు, కుసుమలు, ఆముదం, శనగ, పెసర, మినుము, బొబ్బర్లు, కొత్తిమీర, ఉల్లి, ఆలుగడ్డ, పచ్చిమిరప, పుచ్చకాయ, కూరగాయలను ఆరుతడి పంటలుగా పండించవచ్చు. వీటి వల్ల సాగు ఖర్చు, ఎరువుల వినియోగం, చీడపీడల ఉద్ధృతి తగ్గుతుంది. తక్కువ నీటితో అధిక దిగుబడి వస్తుంది. భూసారం పెరుగుతుంది. ఇవి 80-110 రోజులలో కోతకు వస్తాయి. అందుకే తక్కువ కాలంలో, తక్కువ నీటితో, ఎక్కువ ఆరుతడి పంటలు పండించవచ్చు.
News October 21, 2025
భారీ వర్షాలు.. యెల్లో అలర్ట్ జారీ

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. మరో 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముంది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ తిరుపతి, కడప, ఒంగోలు, నెల్లూరు జిల్లాలో మోస్తరు వానలు పడతాయని తెలిపింది.