News September 10, 2025
అమ్మాయిలకి ఈ టెస్టులు చేయించండి..

ఆడపిల్లలున్న తల్లిదండ్రులు వారు రజస్వల అయినప్పటి నుంచి వారికి కొన్ని ఆరోగ్య పరీక్షలు కచ్చితంగా చేయించాలంటున్నారు నిపుణులు. రక్తహీనత సమస్యను గుర్తించడానికి కంప్లీట్ బ్లడ్ కౌంట్(సీబీసీ) పరీక్ష, హార్మోన్ల అసమతుల్యతను గుర్తించడానికి థైరాయిడ్, హార్మోన్ల పరీక్షలు, విటమిన్‌ప్రొఫైల్ టెస్ట్, ఏవైనా మూత్ర సంబంధిత సమస్యలుంటే మూత్ర పరీక్ష చేయించాలి. వీటివల్ల ఏవైనా సమస్యలుంటే ముందుగానే గుర్తించే వీలుంటుంది.
Similar News
News September 10, 2025
Dy.CM ఫొటో ఏర్పాటుపై నిషేధం లేదు: హైకోర్టు

AP: రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో Dy.CM ఫొటోల ఏర్పాటుపై ఎక్కడా నిషేధం లేదని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వ కార్యాలయాల్లో Dy.CM పవన్ కళ్యాణ్ ఫొటో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగి వై.కొండలరావు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ రాజకీయ దురుద్దేశంతో వేసినట్లుగా ఉందని, అందుకే కొట్టివేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి పిటిషన్లతో కోర్టు సమయాన్ని వృథా చేయొద్దని సూచించింది.
News September 10, 2025
సిద్ధార్థ్ మాల్యాతో అందుకే బ్రేకప్: దీపికా పదుకొణె

తన మాజీ ప్రియుడు సిద్ధార్థ్ మాల్యాతో బ్రేకప్‌పై హీరోయిన్ దీపికా పదుకొణె ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘సిద్ధార్థ్ బిహేవియర్ దారుణంగా ఉంటుంది. మేం ఇద్దరం కలిసి చివరిసారిగా డిన్నర్‌కు వెళ్లినప్పుడు నన్ను బిల్ పే చేయమన్నాడు. అది నాకెంతో ఇబ్బందిగా అనిపించింది. ఆ తర్వాత అతడితో రిలేషన్ కొనసాగించడానికి నాకు ఒక్క ఆప్షన్ కూడా కనిపించలేదు’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఆ తర్వాత రణ్‌వీర్‌ను దీపిక పెళ్లాడారు.
News September 10, 2025
అగ్రికల్చర్ వర్సిటీలో PG, PhDలో ప్రవేశాలు

<