News August 6, 2025

హెలికాప్టర్ ప్రమాదంలో ‘ఘనా’ మంత్రులు మృతి

image

ఘనా దేశ రక్షణ మంత్రి, పర్యావరణశాఖ మంత్రి హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆక్రా నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వారి హెలికాప్టర్ రాడార్ నుంచి అదృశ్యమైందని అధికారులు పేర్కొన్నారు. మంత్రులు ఎడ్వర్డ్ ఒమేన్ బోమా, ఇబ్రహీం ముర్తాలా మహ్మద్ సహా 8 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. ‘మంత్రులు, జవాన్లు దేశ సేవలో ప్రాణాలు కోల్పోయారు’ అని ఘనా ప్రభుత్వం సంతాపం తెలియజేసింది.

Similar News

News August 7, 2025

బీసీ రిజర్వేషన్లు.. నెక్స్ట్ ఏంటి?

image

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై నెక్స్ట్ ఏం జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదించకపోవడంతో రాహుల్‌ను PMను చేసి రిజర్వేషన్లు సాధిస్తామని <<17320951>>CM రేవంత్<<>> నిన్న అన్నారు. దీంతో ప్రభుత్వపరంగా రిజర్వేషన్లు సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

News August 7, 2025

ఈ నెలాఖరున ఇండియాకు పుతిన్?

image

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరున ఆయన ఇండియాకు వస్తారని సమాచారం. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య స్నేహసంబంధాలపై ప్రధాని మోదీతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అక్కడి పత్రికలకు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.

News August 7, 2025

‘అమ్మా.. ఇక సెలవు’

image

AP: వడ్డీ వ్యాపారుల దోపిడీకి ఓ నిండు ప్రాణం బలైంది. అనంతపురం(D) గుత్తి సెంట్రల్ బ్యాంకులో సబ్ స్టాఫ్‌గా పనిచేసే రవికుమార్ ఓ వడ్డీ వ్యాపారిని ₹50వేల లోన్‌ అడగగా ₹15K పట్టుకుని ₹35K ఇచ్చారు. దానికి వడ్డీనే ₹1.20 లక్షలు చెల్లించిన రవి ఇక తన వల్ల కాదని బ్యాంకు వాష్‌రూంలో ఉరేసుకున్నాడు. ‘నా టైం అయిపోయింది. అప్పులే నాకు శాపమయ్యాయి. అమ్మా.. ఇక సెలవు. హరితా (భార్య) నన్ను క్షమించు’ అని సూసైడ్ నోట్ రాశారు.