News September 20, 2024

నెయ్యిలో నాణ్యత లేదు: టీటీడీ ఈఓ

image

AP: తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో నాణ్యతా లోపాన్ని తాను గమనించానని టీటీడీ ఈఓ శ్యామలరావు తెలిపారు. ‘నాణ్యమైన నెయ్యిని అంత తక్కువ ధరకు సరఫరా చేయలేరు. రూ.320కి కల్తీ నెయ్యి మాత్రమే వస్తుంది. తక్కువ ధర కారణంగా నాణ్యత క్షీణిస్తుంది. నెయ్యి నాణ్యతపై పోటు సిబ్బంది కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.75 లక్షలతో టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటయ్యేది. కానీ గత ప్రభుత్వం ఆ పని చేయలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News November 23, 2025

రేషన్ కార్డులు ఉన్న వారికి ఫ్రీగా క్లాత్ బ్యాగులు?

image

TG: వచ్చే నెల నుంచి రేషన్ కార్డులు ఉన్న వారికి సన్నబియ్యంతో పాటు మల్టీ పర్పస్ క్లాత్ బ్యాగులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ప్లాస్టిక్ వినియోగం తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యాగులపై ప్రభుత్వ 6 గ్యారంటీల లోగోలు ఉంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా OCTలోనే ఈ బ్యాగులను పంపిణీ చేయాల్సి ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది.

News November 23, 2025

నాకు పేరు పెట్టింది ఆయనే: సాయిపల్లవి

image

పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ సాయిపల్లవి గతంలో చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. తన అమ్మ, తాతయ్య సాయిబాబాకు భక్తులని తెలిపారు. పుట్టపర్తి సాయి తనను దీవించి పేరు పెట్టినట్లు వెల్లడించారు. తాను కూడా సాయిబాబా భక్తురాలినేనని, ఆయన బోధనలు తనలో ధైర్యం నింపాయని చెప్పారు. ప్రశాంతత, క్రమశిక్షణ, ధ్యానం వంటివి ఆయన నుంచి నేర్చుకున్నట్లు పేర్కొన్నారు.

News November 23, 2025

APPLY NOW: జిప్‌మర్‌లో ఉద్యోగాలు

image

జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(JIPMER) 9 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD, DM, MS, DNB, M.Ch ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. వెబ్‌సైట్: https://jipmer.edu.in/