News October 17, 2024

యాదాద్రిలో నెయ్యి స్వచ్ఛమైనదే: ఈవో

image

TG: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి స్వచ్ఛమైనదేనని పరీక్షల్లో తేలినట్లు ఈవో భాస్కరరావు తెలిపారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలతో ప్రభుత్వ ఆదేశాల మేరకు నెయ్యిని పరీక్షలకు పంపామన్నారు. కిలో రూ.609కి కొనుగోలు చేస్తున్న నెయ్యి నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉన్నట్లు తెలిపారు. రోజుకు వెయ్యి కిలోల నెయ్యిని మదర్ డెయిరీ నుంచి కొనుగోలు చేస్తున్నామని చెప్పారు.

Similar News

News December 6, 2025

ఇంటింటికీ ఫ్రీ వైఫై, టీవీ ఛానల్స్.. బాండ్ రాసిచ్చిన సర్పంచ్ అభ్యర్థి

image

TG: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఓటర్లను ఆకర్షించేందుకు సర్పంచ్ అభ్యర్థులు స్థాయికి మించిన హామీలు ఇస్తున్నారు. అయితే ఇచ్చిన హామీలపై బాండ్లు రాసిచ్చేవారు అరుదు. ములుగు(D) ఏటూరునాగారంలో BJP బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ధనలక్ష్మి, ఆమె భర్త చక్రవర్తి ఇంటింటికీ వైఫై, ఐదేళ్లు టీవీ ఛానల్స్ ఫ్రీగా అందిస్తామని బాండ్ రాసిచ్చారు. కోతుల బెడద, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

News December 6, 2025

సరిహద్దులపై ‘డ్రాగన్’ పడగ.. 16 స్థావరాల నిర్మాణం!

image

భారత సరిహద్దుల్లో చైనా కుతంత్రాలు ఆగడం లేదు. టిబెట్‌లో సైనిక సదుపాయాలను వేగంగా విస్తరిస్తోందని, 16 ఎయిర్‌ఫీల్డ్‌లు, హెలిపోర్ట్‌లను నిర్మించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఈ మేరకు 100కు పైగా శాటిలైట్ ఇమేజె‌స్‌ను విశ్లేషించింది. ఆ స్థావరాలు చాలావరకు 14 వేల అడుగుల ఎత్తులో ఉన్నాయని చెప్పింది. 14,850 అడుగుల పొడవైన రన్ వేలు, 70 కన్నా ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్ షెల్టర్లు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొంది.

News December 6, 2025

రబీ నువ్వుల సాగు.. నేలలు, నాటే సమయం

image

మురుగునీటి పారుదల బాగా ఉన్న నల్లరేగడి లేదా తేలిక నేలలు నువ్వుల పంట సాగుకు అనుకూలం. ఆమ్ల, క్షార గుణాలు కలిగిన నేలలు ఈ పంట సాగుకు పనికిరావు. తగినంత తేమ నిలుపుకొనే ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు మరింత అనువైనవి. కోస్తా జిల్లాల్లో రబీలో/రబీ వేసవి పంటగా డిసెంబర్ రెండో పక్షం నుంచి జనవరి నెలాఖరు వరకు నువ్వులను విత్తుకోవచ్చు. విత్తుట ఆలస్యమైతే పంటకు వెర్రి తెగులు ఆశించి దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.