News September 20, 2024
నెయ్యి నాణ్యత 100 పాయింట్లకు 20 పాయింట్లే ఉంది: టీటీడీ ఈఓ

AP: నెయ్యి నాణ్యత ఉంటేనే, లడ్డూ నాణ్యతగా ఉంటుందని టీటీడీ ఈఓ శ్యామలరావు అన్నారు. గతంలో వాడిన నెయ్యి నాణ్యత 100 పాయింట్లకుగానూ 20 పాయింట్లే ఉందని ఆయన తెలిపారు. ‘గతంలో ఏఆర్ డెయిరీ వచ్చిన 4 ట్యాంకర్లలోని నెయ్యిని తిరిగి పంపాం. ఆ నెయ్యిని 10 ల్యాబ్‌లలో పరీక్షించాం. వారంలో రిపోర్టు వచ్చింది. ఆ నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్లు రిపోర్టులో తేలింది’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 27, 2025
ఆన్లైన్ కంటెంట్ చూసేందుకు ఆధార్‌తో ఏజ్ వెరిఫికేషన్?

OTT/ఆన్లైన్ కంటెంట్‌పై సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది. అశ్లీలంగా భావించే కంటెంట్ విషయంలో ఆధార్ ద్వారా ఏజ్ వెరిఫికేషన్ చేయవచ్చని చెప్పింది. ‘షో ప్రారంభంలో వేసే హెచ్చరిక కొన్నిక్షణాలే ఉంటుంది. తర్వాత కంటెంట్ ప్రసారం కొనసాగుతుంది. అందుకే ఆధార్ వంటి వాటితో వయసు ధ్రువీకరించాలి. ఇది సూచన మాత్రమే. పైలట్ ప్రాతిపదికన చేపట్టాలి. మనం బాధ్యతాయుత సొసైటీని నిర్మించాలి’ అని CJI జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు.
News November 27, 2025
కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

AP: దిత్వా తుఫాను ప్రభావంతో రేపు GNT, బాపట్ల, ప్రకాశం, NLR, ATP, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు APSDMA తెలిపింది. ‘శనివారం అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో అతిభారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఆదివారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సుంది’ అని పేర్కొంది.
News November 27, 2025
ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న సిటీ ఏదో తెలుసా?

ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన నగరంగా ఇండోనేషియాలోని జకార్తా నిలిచింది. అక్కడ 4.19 కోట్ల మంది నివసిస్తున్నారు. 3.66 కోట్లతో బంగ్లాదేశ్‌లోని ఢాకా రెండో స్థానంలో ఉంది. టోక్యో(జపాన్) 3.34 కోట్ల జనాభాతో మూడో స్థానం, 3 కోట్ల మందితో ఢిల్లీ నాలుగో స్థానంలో ఉన్నాయి. 2050 నాటికి ఢాకా ఈ లిస్టులో తొలి స్థానానికి చేరే అవకాశం ఉందని ప్రపంచ అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్స్-2025 రిపోర్టులో ఐక్యరాజ్యసమితి తెలిపింది.


