News September 22, 2024

సింహాచలం అప్పన్న ఆలయంలో నెయ్యి సీజ్

image

AP: విశాఖ జిల్లాలోని ప్రముఖ సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో అధికారులు తనిఖీలు నిర్వహించి 945 కిలోల నెయ్యిని సీజ్ చేశారు. ఏలూరు జిల్లా రైతు డెయిరీ నుంచి నెయ్యి సరఫరా అయినట్లు అధికారులు తెలిపారు. నెయ్యి, లడ్డూలో వాడే ఇతర పదార్థాల శాంపిల్స్‌ని సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు.

Similar News

News September 22, 2024

ప్యూరిఫైడ్ వాటర్‌తో మెగ్నీషియం లోపం?

image

మెగ్నీషియం మన నరాల వ్యవస్థ పనితీరుకు, డయాబెటిస్, ఇస్కీమిక్ స్ట్రోక్ నివారణకు అత్యవసరం. ప్రకృతిసిద్ధంగా లభించే నీటిలో 10-20 శాతం మేర మెగ్నీషియం ఉంటుంది. కానీ నేడు వాడుతున్న ప్యూరిఫైడ్ లేదా మినరల్ వాటర్‌లో అన్ని మినరల్స్‌ను తొలగిస్తున్నారని ఇజ్రాయెల్ పరిశోధకులు తెలిపారు. దీంతో నీటి ద్వారా లభించాల్సిన మెగ్నీషియం మనకు అందడం లేదని, మినరల్ వాటర్ మృతజలాలతో సమానమని తాజా నివేదికలో హెచ్చరించారు.

News September 22, 2024

లడ్డూ ప్రసాదంలో కల్తీ నిజమే: రఘురామ

image

AP: తిరుమల లడ్డూ ప్రసాదంలో నాణ్యత తగ్గిందని కొంతకాలంగా భక్తులు అంటున్న మాట వాస్తవమేనని MLA రఘురామకృష్ణరాజు అన్నారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నిజమేనన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో కమీషన్ల కోసం కల్తీ నెయ్యికి జగన్ అనుమతించారని ఆరోపించారు. 2019 వరకు శ్రీవారి ప్రసాదం జోలికి పాలకులు వెళ్లలేదని అన్నారు. ఇకపై స్వచ్ఛమైన నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారు చేసేలా CM చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

News September 22, 2024

గూగుల్‌పై చర్యలకు సిద్ధమవుతున్న EU

image

యూరోపియ‌న్ యూనియ‌న్ నుంచి గూగుల్‌కు మ‌రో భారీ ఎదురుదెబ్బ త‌ప్పేలా లేదు. సెర్చ్ ఇంజిన్‌లో అన్ని సంస్థ‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చే విష‌యంలో గూగుల్ వేగంగా స్పందించ‌క‌పోతే భారీ జ‌రిమానాతోపాటు బిజినెస్ మోడ‌ల్ మార్పుల‌పై ఆదేశాలు ఇచ్చే అవ‌కాశం ఉన్నట్టు EU అధికారులు చెబుతున్నారు. గూగుల్ ఫ్లైట్స్‌, హోటల్స్ వంటి స‌ర్వీసుల్లో గూగుల్ సెర్చ్‌లో చూపించే ఫ‌లితాల స‌ర‌ళికి వ్య‌తిరేకంగా ఈయూ ఛార్జిషీట్ సిద్ధం చేస్తోంది.