News August 18, 2024

GHMCలో వారందరికీ స్థాన చలనం

image

GHMCకి కొత్తగా వచ్చిన అధికారులకు బాధ్యతల అప్పగింత, ఇప్పటికే ఇక్కడ పనిచేస్తున్న పలువురికి అంతర్గత స్థానచలనం కల్పించే ప్రక్రియ మొదలైంది. పారిశుద్ధ్య, ప్రణాళిక విభాగాల్లోని పలువురు అధికారులకు బాధ్యతలు కేటాయిస్తూ కమిషనర్ ఆమ్రపాలి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతర్గత బదిలీలు ఇంకా ఉంటాయని, వేర్వేరు విభాగాల్లో రెండేళ్లుగా ఒకే స్థానంలో ఉన్న అధికారులు, సిబ్బందికి స్థాన చలనం ఉంటుందన్నారు.

Similar News

News November 28, 2025

శంషాబాద్: విమానంలో ప్రయాణికురాలితో అసభ్య ప్రవర్తన

image

విమానంలో మహిళ ప్రయాణికురాలతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. పోలీసుల వివరాలు.. బుధవారం జైపూర్ నుంచి ఇండిగో విమానం శంషాబాద్‌కు వస్తుండగా.. పక్క సీట్లో కూర్చున్న మహిళ ప్రయాణికురాలిని ఓ వ్యక్తి తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయమై ఎయిర్ లైన్స్ అధికారులు ఆర్జీఐఏ ఔట్ పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

News November 28, 2025

HYD: నేడు, రేపు డిగ్రీ కోర్సుల తుది కౌన్సిలింగ్

image

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయాల్లోని డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తుది దశ కౌన్సిలింగ్ ఈరోజు, రేపు నిర్వహించనున్నారు. ఈ కౌన్సిలింగ్ రెగ్యులర్ డిగ్రీ, స్పెషల్ కోటా యూజీ కోర్సుల భర్తీకి సంబంధించింది. ప్రస్తుతం రైతు కోటాలో 22 సీట్లు, రైతు కూలీల కోటాలో 40 సీట్లు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

News November 28, 2025

శంషాబాద్: సమతా స్ఫూర్తి కేంద్రంలో 30న ఈక్వాలిటీ రన్

image

శంషాబాద్ మండలం ముచ్చింతల్ శివారులోని సమతా స్ఫూర్తి కేంద్రం వద్ద ఈనెల 30న ఈక్వాలిటీ రన్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి పర్యవేక్షణలో రన్ ఫర్ ఈక్వాలిటీ, ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్ అనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.హాఫ్ మారథాన్, 10కే, 5కే, 3కే విభాగాల్లో పరుగు ప్రారంభం అవుతుందన్నారు.