News August 2, 2024
GHMCలో విలీనం కానున్న కార్పొరేషన్ల LIST

GHMCలో <<13752316>>విలీనం కానున్న<<>> మున్సిపల్ కార్పొరేషన్ల లిస్ట్ డ్రాఫ్ట్ బిల్లులో అధికారులు పొందుపరిచారు. ఇందులో RR జిల్లాలోని బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, మీర్పేట్.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని జవహర్‌నగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, నిజాంపేట్ కార్పొరేషన్లు ఉన్నాయి. డ్రాఫ్ట్ బిల్ ఆమోదం తెలిపితే ఈ ప్రాంతాలు GHMCలో విలీనం కానున్నాయి. ఈ మేరకు పూర్తి వివరాలతో అధికారులు డ్రాఫ్ట్ బిల్లు సిద్ధం చేశారు. SHARE IT
Similar News
News December 12, 2025
ఖైరతాబాద్: 19 నుంచి ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్

మహానగరం మరో భారీ కార్యక్రమానికి వేదిక కానుంది. ఈ నెల 19 నుంచి సిటీలో HYD ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు ఈ వేడుకలు ఉంటాయి. ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. యూరప్, అమెరికా తదితర సినిమాలు ఇందులో ప్రదర్శిస్తారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు.
News December 12, 2025
నగరంలో TTD క్యాలెండర్లు, డైరీల విక్రయం

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రాలతో అందంగా రూపొందించిన క్యాలెండర్లు, డైరీలు ఇపుడు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నాయి. హిమాయత్‌నగర్, జూబ్లీహిల్స్‌లోని టీటీడీ ఆలయాల్లో వీటితో పాటు శ్రీవారి లడ్డూలు అందుబాటులో ఉన్నాయని TTD అధికారులు తెలిపారు. క్యాలెండర్లు రూ.130, రూ.75, డైరీలు రూ.150, రూ.120కు విక్రయిస్తున్నారు. భక్తులు ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరారు.
News December 12, 2025
HYD: ITI చేశారా? జాబ్ కొట్టండి..!

జిల్లా ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నర్సయ్య తెలిపారు. చర్లపల్లిలో ఉన్న కంపెనీలో టెక్నికల్ ఉద్యోగాల కోసం ఈ మేళా నిర్వహిస్తున్నారన్నారు. మల్లేపల్లిలోని ఐటీఐ క్యాంపస్‌లో జాబ్ మేళా ఉంటుందన్నారు. ఫిట్టర్, వెల్డర్‌లో ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు హాజరుకావచ్చని పేర్కొన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశం వినియోగించుకోవాలని సూచించారు.


