News February 5, 2025
GHMCలో ఎలక్షన్స్.. నోటిఫికేషన్ విడుదల
GHMCలో స్టాండింగ్ కమిటీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కమిషనర్ ఇలంబర్తి షెడ్యూల్ విడుదల చేశారు. ప్రస్తుత 146 మంది కార్పొరేటర్లలో 15 మంది సభ్యులను ఎన్నుకోవాలి. GHMC హెడ్ ఆఫీస్‌లో FEB 10 నుంచి 17 నామినేషన్లు స్వీకరిస్తారు. 18వ తేదీన పరిశీలన, తుదిజాబితా వెల్లడిస్తారు. 21న ఉపసంహరణ, 25న ఎన్నిక ఉంటుంది. అదే రోజు ఓటింగ్ ముగిశాక లెక్కింపు చేస్తారు. ఏ పార్టీ నుంచి ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠగా మారింది.
Similar News
News February 5, 2025
ఘట్‌కేసర్‌లో రైల్వే ట్రాక్‌పై సూసైడ్!
ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్‌పై మృతదేహం కలకలం రేపింది. మాధవరెడ్డి ఫ్లైఓవర్ వద్ద రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే పోలీసుల వివరాలు.. నిన్న రాత్రి కాగజ్‌నగర్ నుంచి బీదర్ వెళుతున్న రైలు కింద పడి వ్యక్తి చనిపోయాడు. తల మీదుగా ట్రైన్ వెళ్లడంతో ముఖం ఛిద్రమైంది. ఇది గమనించిన ట్రైన్ కో పైలెట్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 5, 2025
లక్ష డప్పులతో కృష్ణ ఎక్స్‌ప్రెస్ ఎక్కి అమరావతి వెళ్లండి: డా.రవి
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మాదిగల చిరకాల స్వప్నమైన ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపి అమలుపరిచిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి మండలికి ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం విజయోత్సవ సంబరాలలో భాగంగా ఆయన గాంధీ భవన్‌లో మాట్లాడారు.
News February 5, 2025
HYD: యూరిన్ శాంపిల్ లేకుండానే ఇన్ఫెక్షన్ల గుర్తింపు!
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) సహాయంతో యూరిన్ శాంపిల్ తీసుకోకుండానే మూత్ర ఇన్ఫెక్షన్లను గుర్తించి.. HYD సెంట్రల్ యూనివర్సిటీ వేదికగా సైన్వీ బయోసైన్స్, ఆస్ఫైర్ బయోనెస్ట్ సంయుక్తంగా మోడల్ ఆవిష్కరించింది. 2024లో జరిగిన AI ఆధారిత ఆవిష్కరణల్లో ప్రపంచ స్థాయిలో 24వ ర్యాంకును ఈ మోడల్ దక్కించుకుంది. రాబోయే రోజుల్లో ఏఐ అద్భుతాలు సృష్టించబోతున్నట్లు డాక్టర్లు తెలిపారు.