News February 5, 2025
GHMCలో ఎలక్షన్స్.. నోటిఫికేషన్ విడుదల

GHMCలో స్టాండింగ్ కమిటీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కమిషనర్ ఇలంబర్తి షెడ్యూల్ విడుదల చేశారు. ప్రస్తుత 146 మంది కార్పొరేటర్లలో 15 మంది సభ్యులను ఎన్నుకోవాలి. GHMC హెడ్ ఆఫీస్‌లో FEB 10 నుంచి 17 నామినేషన్లు స్వీకరిస్తారు. 18వ తేదీన పరిశీలన, తుదిజాబితా వెల్లడిస్తారు. 21న ఉపసంహరణ, 25న ఎన్నిక ఉంటుంది. అదే రోజు ఓటింగ్ ముగిశాక లెక్కింపు చేస్తారు. ఏ పార్టీ నుంచి ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠగా మారింది.
Similar News
News July 4, 2025
NZB: రెండు రోజుల పసికందు విక్రయం

NZBలో 2 రోజుల పసికందును విక్రయానికి పెట్టింది ఓ తల్లి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ గర్భిణి జూన్ 30న ప్రభుత్వ ఆసుపత్రిలో మగ శిశివుకు జన్మనించింది. నాగారానికి చెందిన ఓ మధ్యవర్తి సాయంతో పులాంగ్ ప్రాంతానికి చెందిన మరో మహిళకు రూ.2 లక్షలకు విక్రయించేందుకు బేరం కుదిరింది. ఈ విషయం 1 టౌన్ పోలీసులకు తెలియడంతో తల్లితో పాటు మధ్యవర్తులను విచారిస్తున్నారు.
News July 4, 2025
కామారెడ్డి జిల్లాలో చేపల వేటపై నిషేధం

కామారెడ్డి జిల్లాలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీపతి శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. సంఘాల పరిధిలోని 100 ఎకరాల ఆయకట్టు పైన, లోబడి ఉన్న చెరువులు ఎవరికీ కౌలుకు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఈ నిబంధనలు అతిక్రమించిన సంఘాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జులై, ఆగస్టు నెలల్లో జిల్లాలోని అన్ని చెరువులు, రిజర్వాయర్, కుంటలలో చేపల వేటను నిషేధించామన్నారు.
News July 4, 2025
శ్రీ సత్యసాయి: పడిపోయిన వెల్లుల్లి ధరలు

ఈ ఏడాది ఆరంభం నుంచి వెల్లుల్లి ధరలు ఆకాశాన్నంటాయి. రెండు వారాలుగా ధరలు తగ్గుముఖం పట్టాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కిలో రూ.400 వరకు పలికిన వెల్లుల్లి ప్రస్తుతం రూ.80 నుంచి రూ.100 పలుకుతోందని వ్యాపారులు తెలిపారు. దీంతో ప్రస్తుతం వెల్లుల్లి సాగు చేసిన రైతులు డీలపడ్డారు. ధరలు పెరగడం వల్ల ప్రజలు, ఉన్నఫలంగా ధర అట్టడుగు స్థాయికి పడిపోవడంతో రైతులు నష్టపోతున్నారన్నారు.