News December 3, 2025

GHMCలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనం

image

TG: గ్రేటర్ హైదరాబాద్‌లో 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీల విలీనం పూర్తయింది. ఇది నిన్నటి నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ORR వరకు, దానికి అవతలి వైపు ఆనుకొని ఉన్న ప్రాంతాలను GHMCలో విలీనం చేయాలని ఇటీవల ప్రభుత్వం క్యాబినెట్‌లో నిర్ణయించింది. దీనికి గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. ఈ విలీనం ద్వారా గ్రేటర్ హైదరాబాద్‌ దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించింది.

Similar News

News December 4, 2025

శాలౌగారారం: కాంగ్రెస్‌లో చేరి సర్పంచ్‌గా ఏకగ్రీవం

image

SLG సర్పంచి ఏకగ్రీవ ఎన్నిక నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. ఇక్కడ సర్పంచ్ ఎన్నికల్లో మొత్తం 13 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరిలో 11మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా చివరికి కాంగ్రెస్, BRS సానుభూతిపరులు ఒక్కొక్కరు మాత్రమే బరిలో నిలిచారు. చివరి క్షణంలో BRS మద్దతుదారు గుజిలాల్ శేఖర్ బాబు కాంగ్రెస్‌లో చేరి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదృష్టం అంటే ఈయనదే మరి. ఏమంటారు మీరు.

News December 4, 2025

థైరాయిడ్‌ ట్యూమర్స్‌ గురించి తెలుసా?

image

థైరాయిడ్‌ గ్రంథి పనితీరుపైనే మనిషి జీవక్రియలు ఆధారపడి ఉంటాయి. ఇంతటి ప్రధానమైన థైరాయిడ్‌ గ్రంథిలో కొన్నిసార్లు ట్యూమర్స్ ఏర్పడతాయి. గొంతు భాగంలో వాపు/ గడ్డ ఏర్పడినట్లు కనిపిస్తుంది. ఈ వాపు అనేది ఆహారం తీసుకునేటప్పుడు లేదా మింగేటప్పుడు పైకీ కిందకీ కదులుతుంది. కానీ ఎటువంటి నొప్పి, ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు. కణితి పరిమాణం పెరిగినప్పుడు ఆహారం తీసుకుంటుంటే పట్టేసినట్లుగా అనిపిస్తుంది.

News December 4, 2025

థైరాయిడ్‌ ట్యూమర్స్‌ చికిత్స

image

థైరాయిడ్‌ ట్యూమర్స్‌ వచ్చినప్పుడు అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేసి ఏ రకమైన కణితో తెలుసుకుంటారు. అలా తెలియకపోతే నీడిల్‌ ద్వారా కణితిలోని కొన్ని కణాలను బయటికి తీసి, మైక్రోస్కోప్‌లో పరీక్షిస్తారు. థైరాయిడ్‌ కణితి 3 సెం.మీ. కన్నా పెద్దగా ఉండి, ఆహారం తీసుకున్నప్పుడు ఇబ్బందికరంగా ఉంటే సాధారణంగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి నాన్‌ సర్జికల్‌ ట్రీట్‌మెంట్‌/ సర్జికల్ ట్రీట్‌మెంట్ చేస్తారు.