News January 4, 2026
GHMCలో మరోసారి బదిలీలు.. రంగంలోకి కొత్త JCలు!

నగర పాలక సంస్థలో పాలనాపరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. GHMC కమిషనర్ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. అడిషనల్ కమిషనర్ కె.వేణుగోపాల్‌ను మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్ల జాయింట్ కమిషనర్‌గా నియమించారు. సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ గీతా రాధికను కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్ల బాధ్యతలు అప్పగించారు. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలు వెలువడ్డాయి.
Similar News
News January 8, 2026
HYDలో ఇళ్లు కట్టుకునేవారికి గుడ్‌న్యూస్

ఇల్లు కట్టుకున్నాక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేక కరెంట్, నీళ్ల కనెక్షన్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారా? ఇక ఆ కష్టాలకు చెక్! పర్మిషన్ గడువు ముగిసినా, ప్లాన్ ప్రకారమే కట్టిన నాన్ హైరైజ్ భవనాలకు ఓసీ ఇచ్చేందుకు జీహెచ్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గడువు దాటిన రెండేళ్లలోపు అప్లై చేస్తే పాత ఫీజులే, ఆ పైన అయితే కొత్త రేట్ల ప్రకారం ఛార్జీలు కట్టి సర్టిఫికెట్ పొందవచ్చు.
SHARE IT
News January 8, 2026
IT కారిడార్‌లో అర్ధరాత్రి బేఫికర్!

ఆఫీసు నుంచి ఆలస్యంగా వచ్చే టెక్కీలైనా, రాత్రివేళ నడిచే సామాన్యులైనా చీకటి గల్లీల్లో అడుగు వేయాలంటే భయం. ఈ భయాన్ని పోగొట్టడానికే శేరిలింగంపల్లిలో రూ.50 కోట్లతో జీహెచ్‌ఎంసీ కొత్త వెలుగులు నింపుతోంది. కేవలం లైట్లు వేయడమే కాదు.. అవి ఐదేళ్ల పాటు వెలిగేలా గ్యారెంటీ బాధ్యత కూడా కాంట్రాక్టరుదేనని అధికారులు తెలిపారు. దీంతో మన రోడ్లపై రాత్రిపూట కూడా సురక్షితంగా, ధీమాగా తిరిగే భరోసా లభిస్తుంది.
News January 8, 2026
కాచిగూడలో హిందూ- ముస్లిం లవ్ మ్యారేజ్

నగరంలో అంతర్మత వివాహం చట్టబద్ధంగా నమోదైంది. హిందూ–ముస్లిం యువతి యువకుల మధ్య జరిగిన ఈ వివాహాన్ని కాచిగూడ PSలో అధికారికంగా రిజిస్ట్రేషన్ చేశారు. మేజర్ల సమ్మతితో, అన్ని చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ వివాహ ప్రక్రియ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసు భద్రత ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.


