News January 20, 2025
GHMC ఆఫీస్‌లో ప్రజావాణి కార్యక్రమం

ఖైరతాబాద్‌లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను, వినతులను స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు పరిష్కరించాలని ఆదేశించారు. సకాలంలో సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులను డిప్యూటీ మేయర్ ఆదేశించారు.
Similar News
News February 18, 2025
HYD: రూ.183 కోట్లు బాధితులకు తిరిగి ఇవ్వడం రికార్డు: మంత్రి

గచ్చిబౌలిలోని హెచ్ఐసీసీలో జరిగిన షీల్డ్-2025 సదస్సుకు మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.350 కోట్లు ఫ్రీజ్ చేసి రూ.183 కోట్లు బాధితులకు తిరిగి ఇవ్వడం రికార్డని, డిజిటల్ యుగంలో కొత్త అడుగులతో పాటు ఇబ్బందులు కూడా ఉంటాయన్నారు.మనదేశంలో దాదాపు రూ.15 వేల కోట్ల వరకు సైబర్ నేరగాళ్లు కాజేస్తున్నారన్నారు.
News February 18, 2025
HYD: ఢిల్లీకి వెళ్లి 35 పైసలు కూడా తేలేదు: KTR

ఆమనగల్లులో రైతు దీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్ల పాలనలో రైతులు వివరి దగ్గర చెయ్యి చాచలేదని, 35 సార్లు ఢిల్లీకి తిరిగిన రేవంత్ రెడ్డి 35 పైసలు కూడా తేలేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 12 కాలాల్లో రైతుల ఖాతాలో రైతుబంధు కింద రూ.73 వేల కోట్లు వేసిన ఘనత సీఎం కేసీఆర్ అని అన్నారు.
News February 18, 2025
శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న ఓ ప్రయాణికుడి కదలికలపై సీఐఎస్ఎఫ్ అధికారులకు అనుమానం రాగా అతడిని అదుపులోకి తీసుకొని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో అతని వద్ద నుంచి 22 లక్షల విలువైన విదేశీ కరెన్సీ లభించింది. కరెన్సీని స్వాధీనం చేసుకున్న అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.