News January 20, 2025
GHMC ఆఫీస్‌లో ప్రజావాణి కార్యక్రమం

ఖైరతాబాద్‌లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను, వినతులను స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు పరిష్కరించాలని ఆదేశించారు. సకాలంలో సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులను డిప్యూటీ మేయర్ ఆదేశించారు.
Similar News
News February 13, 2025
హుస్సేన్ సాగర్ స్కైవాక్‌కు లైన్ క్లియర్

HYDలోని హుస్సేన్‌సాగర్ చుట్టూ స్కై వాక్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే HMDA ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (PPP) విధానంలో నిర్మాణం చేపట్టాలని యోచిస్తోంది. హుస్సేన్ సాగర్ చరిత్రను దృష్టిలో పెట్టుకొని నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోనున్నారు. స్కైవాక్‌తో పాటు సైకిల్ ట్రాక్‌ను కూడా ఇక్కడ నిర్మించనున్నారు.
News February 13, 2025
HYD: ఎమ్మెల్సీకి నోటీసులు జారీ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తోల్కట్ట ఫామ్ హౌస్‌లో కోడిపందేల నిర్వహణ కేసులో నోటీసులు అందజేసినట్లు అధికారుల సమాచారం. ఈ నేపథ్యంలో మాదాపూర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫామ్‌హౌస్‌లో కోడిపందాల నిర్వహణపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొన్నారు.
News February 13, 2025
గాంధీభవన్‌లో రేపు యువజన కాంగ్రెస్ ప్రమాణం

రేపు గాంధీభవన్‌లో యువజన కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరగనున్నట్లు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఢిల్లీ నాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు.