News August 13, 2024

GHMC: ఆ ప్రాంతాల్లో ఫుట్ బాల్ గ్రౌండ్లు

image

GHMC గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎల్బీనగర్ జోన్ ప్రాంతంలో జేసీ నగర్, వలావర్ నగర్, కాప్రా ఛత్రపతి శివాజీ గ్రౌండ్, శేర్లింగంపల్లి గోపనపల్లి తండా, మియాపూర్ బస్ డిపో వెనుక, కూకట్పల్లి ఎస్ఆర్ నాయక్ నగర్, అల్వాల్, ఖైరతాబాద్ లంగర్ హౌస్, సికింద్రాబాద్ తిరుమలగిరి, ప్రాంతాల్లో ఫుట్ బాల్ మైదానాల కోసం స్థలాలను అధికారులు గుర్తించారు.

Similar News

News November 16, 2025

HYD: డ్రంక్‌ & డ్రైవ్‌ తనిఖీల్లో దొరికిపోయారు!

image

HYD ట్రాఫిక్ పోలీసులు NOV 14, 15న చేసిన ప్రత్యేక డ్రైవ్‌లో 457 మంది మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. 377 బైక్‌లు, 27 మంది 3 చక్రాలు, 53 మంది 4 చక్రాలు & ఇతర వాహనాలు ఉన్నాయి. BAC స్థాయిల ప్రకారం మొత్తం కేసులు ఇలా ఉన్నాయి: 30–50 మధ్య 83 కేసులు, 51–100 మధ్య 194, 101–150 మధ్య 104, 151–200 మధ్య 44, 201–250 మధ్య 14, 251–300 మధ్య 14, 300 పైగా 4 D&D కేసులు నమోదు చేశారు.

News November 16, 2025

రాష్ట్రపతి హైదరాబాద్ టూర్.. షెడ్యూల్ ఇదే!

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ పర్యటన షెడ్యూలు ఖరారైంది. ఈనెల 21వ తేదీన బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభించనున్నారు. 21న మధ్యాహ్నం 1.10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకొని రాజ్ భవన్‌కు వెళతారు. ఆ తరువాత మధ్యాహ్నం 3.50 గంటలకు బొల్లారం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళామహోత్సవాన్ని ప్రారంభిస్తారు. మరుసటి రోజు ఉదయం పుట్టపర్తికి వెళతారు.

News November 16, 2025

HYD: మీ ఫోన్ పోయిందా? ఇలా చేయండి!

image

మీ మొబైల్ పోయిందా? అశ్రద్ధ చేయకండి. వెంటనే CEIR పోర్టల్ ద్వారా మీ మొబైల్ వివరాలు నమోదు చేసి, స్థానిక పోలీస్ స్టేషన్లో అందించండి. పోలీసులు మీ మొబైల్ వెతికి మీకు అందిస్తారు. 2023 ఏప్రిల్ నుంచి 2025 అక్టోబర్ 16 వరకు పోలీసులు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 84,003 ఫోన్లను బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో గుర్తించినవి 45,261 కాగా.. అందజేసినవి 14,965 ఉన్నట్లు పేర్కొన్నారు.