News March 23, 2025
GHMC కోసం ఒక్క ఏడాదిలో రూ.1600 కోట్లు..!

GHMC పరిధిలో లింక్ రోడ్ల అభివృద్ధి, CSR నిధుల ఫెసిలిటీ, రోడ్ల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఏడాది కాలంలో రూ.1600 కోట్లను జీహెచ్ఎంసీకి విడుదల చేసిందని మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా ప్రభుత్వం నిధులు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News November 21, 2025
మరో తుఫాను ‘సెన్యార్’!

రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుఫానుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన ‘సెన్యార్’ పేరును IMD పెట్టనున్నట్లు సమాచారం. సెన్యార్ అంటే ‘లయన్’ అని అర్థం. తుఫాను ప్రభావంతో 24వ తేదీ నుంచి తమిళనాడులో, 26-29వరకు ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. ఇటీవల ‘మొంథా’ తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే.
News November 21, 2025
కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ పేపర్ 2 పరీక్ష ఎప్పుడంటే?

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) 552 కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులకు సంబంధించి పేపర్ 2 పరీక్ష షెడ్యూల్ను ప్రకటించింది. డిసెంబర్ 14న డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆగస్టు 12న నిర్వహించిన పేపర్ 1 పరీక్షను 6,332 మంది రాయగా.. పేపర్ 2కు 3,642మంది అర్హత సాధించారు.
News November 21, 2025
సెలవులో గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్

గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ సెలవు తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి సొంత రాష్ట్రమైన పంజాబ్ వెళ్లారు. ఈ నెల 26న తిరిగి గుంటూరు వచ్చి మరుసటి రోజు అంటే 27న ఎస్పీ వకుల్ జిందాల్ విధుల్లోకి చేరనున్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావును పోలీస్ శాఖ ఉన్నతాధికారులు గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా నియమించారు.


