News December 17, 2024
GHMC ప్రజావాణికి 43 ఫిర్యాదులు

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జీహెచ్ఎంసి కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. GHMC హెడ్ ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని పలు సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. 43 విన్నపాలు స్వీకరించినట్లు పేర్కొన్నారు.
Similar News
News May 8, 2025
ఓయూ: పరీక్షా ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలతో పాటు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని సూచించారు.
News May 7, 2025
HYD: ‘కారు’లన్నీ అటువైపే!

BRS రజతోత్సవ సభ కోసం నగర శ్రేణులు సిద్ధమయ్యాయి. నియోజకవర్గం నుంచి వేలాది మంది కార్యకర్తలను తరలించేందుకు నాయకులు వాహనాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్‌ను LED లైట్లతో అందంగా అలంకరించారు. సభ వరంగల్‌లో అయినా హైదరాబాద్ కేంద్రంగా పార్టీ నేతలకు కీలక ఆదేశాలు వెళ్లాయి. బస్సులు, డీసీఎంలు, కార్లు ఘట్‌కేసర్ మీదుగా ఎల్కతుర్తి సభా ప్రాంగణానికి చేరుకోనున్నాయి. ఇందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.
News May 7, 2025
హయత్‌నగర్: ప్రాణం తీసిన మస్కిటో కాయిల్

హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భువనేశ్వరినగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. అబ్దుల్ ఖాదర్ జిలానీ ఇంట్లో దోమల కోసం పెట్టిన మస్కిటో కాయిల్ అతని కుమారులు అబ్దుల్ రెహమాన్ (4), అతిఫా(4) పడుకున్న పరుపు పై పడింది. నిప్పు అంటుకోవడంతో పరుపు పూర్తిగా కాలిపోగా.. ఆ పొగతో ఊపిరి ఆడక రెహమాన్ మృతి చెందాడు. అతిఫా అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.