News March 25, 2025
GHMC మేయర్ కనిపించడం లేదని ఫిర్యాదు

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కనిపించడం లేదని మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. GHMC పరిధిలోని సమస్యలపై ఆమె శ్రద్ధ చూపడంలేదని కనీసం ఆమె కార్యాలయంలో కూడా అందుబాటులో ఉండటం లేదని శ్రవణ్ ఆరోపించారు. నగరంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ, మేయర్ వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారని మండిపడ్డారు.
Similar News
News November 22, 2025
మైలార్‌దేవ్‌పల్లిలో గుండెపోటుతో విద్యార్థి మృతి

గుండెపోటుతో విద్యార్థి మృతి చెందిన ఘటన శనివారం మైలార్‌దేవ్‌పల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. బాబుల్‌రెడ్డినగర్‌లో అభయ్ అనే విద్యార్థి ఆడుకుంటూ స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు విద్యార్థిని ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. బాలుడి మృతితో బాబుల్‌రెడ్డినగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
News November 21, 2025
రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోస్‌కు నోటీసులు

GHMC ఖజానాకు గండికొడుతున్న సినిమా స్టూడియోలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. బంజారాహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో విస్తీర్ణానికి ₹11.52 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉండగా యాజమాన్యం ₹49 వేలు చెల్లింస్తోందని గుర్తించారు. జూబ్లీహిల్స్‌లోని రామనాయుడు స్టూడియో విస్తీర్ణం తక్కువ చూపుతూ ₹1.92 లక్షలు చెల్లించాల్సి ఉండగా ₹1,900 చెల్లిస్తుండడంతో GHMC సర్కిల్ 18 అధికారులు నోటీసులు జారీ చేశారు.
News November 20, 2025
‘ఇబ్రహీంపట్నం ఎస్సీ బాయ్స్ హాస్టల్లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదు’

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం SC బాయ్స్ హాస్టల్లో నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ప్రతిరోజూ అందిస్తోన్న అన్నం సరిగా ఉడకకపోవడం, గింజలు గట్టిగా ఉండటం, రుచి తగ్గిపోవడం, కొన్నిసార్లు తినడానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఎదురవుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఇదొక చిన్న సమస్యగా కాకుండా, వారి ఆరోగ్యంపై ప్రభావం చూపే అంశమని, కలెక్టర్ స్పందించాలని కోరుతున్నారు.


