News March 25, 2025

GHMC మేయర్ కనిపించడం లేదని ఫిర్యాదు

image

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కనిపించడం లేదని మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. GHMC పరిధిలోని సమస్యలపై ఆమె శ్రద్ధ చూపడంలేదని కనీసం ఆమె కార్యాలయంలో కూడా అందుబాటులో ఉండటం లేదని శ్రవణ్ ఆరోపించారు. నగరంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ, మేయర్ వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Similar News

News April 2, 2025

రెండో విడత రీ-సర్వే పనులు పూర్తికి కృషి: కలెక్టర్

image

విజయవాడ సీసీఎల్ కార్యాలయం నుంచి బుధవారం రెవెన్యూ సదస్సుల పీజీఆర్ఎస్ రీ సర్వే ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ తదితర అంశాలపై అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అదనపు సీసీఎల్ఏ నక్కల ప్రభాకర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ. ఫ్రీ హోల్డ్ రెండో విడత రీ సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

News April 2, 2025

ముంబై ఫ్రాంచైజీ ఓనర్‌గా సచిన్ కూతురు

image

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కూడా క్రికెట్లోకి అడుగుపెట్టారు. కానీ ప్లేయర్‌గా కాదు ఓనర్‌గా. గ్లోబల్ ఈ-క్రికెట్ ప్రీమియర్‌ లీగ్‌(GEPL)లో ముంబై ఫ్రాంచైజీ యజమానురాలిగా సారా వ్యవహరించనున్నారు. జెట్ సింథెసిస్ నిర్వహించే GEPL.. ఒక ఆన్‌లైన్ గేమింగ్. దీనికి 300మిలియన్ డౌన్‌లోడ్స్ ఉన్నాయి. Jio సినిమా, స్పోర్ట్స్18లో 2.4 మి. మినిట్స్‌కిపైగా స్ట్రీమింగ్ కంటెంట్ అందుబాటులో ఉంది.

News April 2, 2025

ఈమె ప్రపంచంలోనే అతి సంపన్న మహిళ

image

ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన అత్యంత సంపన్న మహిళల జాబితాలో వాల్‌మార్ట్ వారసురాలు అలైస్ వాల్టన్(75) అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఆమె ఆస్తి 102 బిలియన్ డాల్లరకు పైమాటే. ఈ క్రమంలో గత ఏడాది అగ్రస్థానంలో ఉన్న ‘లోరియల్’ వారసురాలు ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయెర్స్‌ను ఆమె అధిగమించారు. భారత్ నుంచి <<15968880>>జిందాల్ గ్రూప్ ఛైర్‌పర్సన్<<>> సావిత్రి జిందాల్(35.5 బిలియన్ డాలర్లు) అగ్రస్థానంలో ఉన్నారు.

error: Content is protected !!