News July 6, 2025

GHMC ఆస్తులపై DGPS సర్వే

image

గ్రేటర్ HYDలో GHMC ఆస్తుల డీజీపీఎస్ సర్వేకు రంగం సిద్ధమైంది. చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి జోన్ల పరిధిలో స్థిరాస్తులు, ఓపెన్ లేఅవుట్లు, పార్కులు, స్థలాలు కమ్యూనిటీ హాల్స్ సహా అన్ని వివరాలను సర్వే చేయించనున్నారు. సర్వే డిజిటలైజేషన్ కోసం కన్సల్టెన్సీల నుంచి టెండర్లు ఆహ్వానించింది. కార్యాలయ భవనాల నుంచి మున్సిపల్ షాపుల దాకా అన్ని వివరాలు పొందుపరచునున్నారు.

Similar News

News July 7, 2025

అభివృద్ధి పథకాలపై ప్రణాళికను ఏర్పాటు చేయాలి- కలెక్టర్

image

కేంద్ర అభివృద్ధి పథకాలపై ఈనెల 9న జరగనున్న దిశ సమావేశానికి సంబంధించి అధికారులు పూర్తి నివేదికలతో, లక్ష్యాల సాధనకు తగిన ప్రణాళికతో హాజరవ్వాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ముందస్తు ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రతి శాఖ ప్రగతిపై సమగ్ర సమాచారం సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు.

News July 7, 2025

అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అందిన అర్జీలను క్షుణంగా పరిశీలించి వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్‌యస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. 394 ఫిర్యాదులు అందాయి అన్నారు. కార్యక్రమంలో జాయింటు కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News July 7, 2025

స్మార్ట్ కార్డులుంటేనే సచివాలయంలోకి ఎంట్రీ!

image

AP: రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల ఎంట్రీకి స్మార్ట్ కార్డు సిస్టమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వచ్చే వారం నుంచే ఈ విధానం అమల్లోకి రానుంది. ప్రతి ఉద్యోగికి క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ కార్డు అందజేస్తారు. మెయిన్ గేట్ వద్ద వాహనాల నంబర్‌ను స్కాన్ చేసి అనుమతించనున్నారు. ఇందుకోసం టోల్గేట్ తరహా టెక్నాలజీ ఉపయోగించనున్నారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వివరాలు, వాహనాల నంబర్ల సేకరణ ప్రారంభమైంది.