News November 24, 2025

GHMC ఎన్నికలపై KTR ఫోకస్

image

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR రాబోయే GHMC ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించారు. KTR నేడు పార్టీ ప్రధాన కార్యాలయంలో BRS ఎమ్మెల్యేలు, MLCలు, మాజీ MLAలు, GHMC కార్పొరేటర్లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ కార్యకలాపాలు, GHMCలోని సమస్యల మీద పోరాటాలపై నేతలకు KTR దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News November 24, 2025

రబీ రాగుల సాగు- మధ్యకాలిక, స్వల్ప కాలిక రకాలు

image

☛ సప్తగిరి: ఇది మధ్యకాలిక రకం. పంట కాలం 100-105 రోజులు. ముద్దకంకి కలిగి, అగ్గి తెగులును తట్టుకొని 12-15 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ☛ వకుళ: పంట కాలం 105-110 రోజులు. దిగుబడి- ఎకరాకు 13-15 క్వింటాళ్లు. ☛ హిమ- తెల్ల గింజ రాగి రకం. పంటకాలం 105-110 రోజులు. దిగుబడి: 10-12 క్వింటాళ్లు. ☛ మారుతి: స్వల్పకాలిక రకం. పంట కాలం 85-90 రోజులు. ఎకరాకు 10-12 క్వింటాళ్ల దిగుబడిస్తుంది. అంతర పంటగా వేసుకోవచ్చు.

News November 24, 2025

పెద్దపల్లిలో కార్మికులకు 10 రోజుల అవగాహన సదస్సులు

image

భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలపై నేటి నుంచి పది రోజుల పాటు అవగాహన సదస్సులు ప్రారంభమయ్యాయని పెద్దపల్లి సహాయ కార్మిక అధికారి హేమలత తెలిపారు. ప్రమాద మరణం, సహజ మరణం, వైకల్య సహాయం వంటి పెంచిన లబ్ధి వివరాలపై కార్మికులకు సమాచారం అందిస్తున్నారు. ప్రతి రెవెన్యూ డివిజన్‌లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి, సభ్యత్వ నమోదు, పునరుద్ధరణ, ఫిర్యాదుల స్వీకరణ చేపడుతున్నారు.

News November 24, 2025

అనంతమైన పుణ్యాన్ని ఇచ్చే విష్ణు నామం

image

ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః|
ఛన్దో నుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః||
విష్ణు సహస్ర నామాలకు రుషి ‘వేదవ్యాసుడు’. ఈ స్తోత్రం ఛందస్సు ‘అనుష్టుప్’. ఈ పారాయణంలో దేవకీ పుత్రుడైన కృష్ణుడిని ఆరాధిస్తాం. అయితే శ్లోకాలను పఠించే ముందు భక్తులు వివరాలు తెలుసుకోవాలి. విష్ణు నామాల మూలం, ఛందస్సు, ఆరాధ దైవం గురించి తెలుసుకొని మరింత సంకల్పంతో పఠిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>