News October 31, 2024

GHMC ఎన్నికలు.. KTR ఆన్సర్ ఇదే!

image

గ్రేటర్ ఎన్నికలపై KTR స్పందించారు. ‘ రాబోయే GHMC ఎన్నికల కోసం BRS కార్యాచరణ, ప్రణాళిక ఏంటి?’ అని ఓ నెటిజన్‌ ‘X’లో ప్రశ్నించారు. ‘GHMC అలాగే ఉంటుందో లేదో తెలియదు. బహుళ యూనిట్లుగా విభజిస్తారని పుకార్లు వస్తున్నాయి. వేచి చూద్దాం’ అంటూ AskKTRలో ఆయన బదులిచ్చారు. కాగా, గ్రేటర్‌లో ప్రస్తుతం 150 డివిజన్లు ఉన్నాయి. అయితే, GHMCలో శివారు మున్సిపాలిటీలు విలీనం అవుతున్నాయి. దీంతో డివిజన్ల సంఖ్య పెరగనున్నాయి.

Similar News

News November 23, 2024

రేపు ఓయూలో ప్రవేశ పరీక్ష

image

ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయం ప్రాంగణంలోని డిస్టెన్స్‌ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు చేసినట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. ఓయూ ఎంబీఏ (ఈవెనింగ్) 2 ఏళ్ల కోర్సు ప్రవేశ పరీక్షను రేపు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News November 22, 2024

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫార్మాసిస్టులు బాధ్యతతో పని చేయాలి: రాజనర్సింహ 

image

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫార్మసిస్టులు బాధ్యతతో పని చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. శుక్రవారం సచివాలయంలో సెంట్రల్ మెడికల్ స్టోర్స్ బలోపేతంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కృత్రిమ మందుల కొరత పై చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాదికారులను ఆదేశించారు. హెల్త్ ఫెసిలిటీ పనితీరుపై సమీక్షలో చర్చించారు.

News November 22, 2024

HYD: ముగిసిన రాష్ట్రపతి పర్యటన

image

HYD మాదాపూర్‌లోని శిల్పారామం వేదికగా జరిగిన లోక్ మంథన్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు పాల్గొన్న విషయం తెలిసిందే. కాగా రాష్ట్రపతి హైదరాబాద్‌లో రెండు రోజుల పర్యటన ముగిసింది. రెండు రోజుల హైదరాబాద్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయంలో మంత్రి సీతక్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆమెకు వీడ్కోలు పలికారు.