News January 3, 2025

GHMC: జలమండలి ఫిర్యాదుల్లో 60% అవే..!

image

గ్రేటర్ హైదరాబాద్‌లో జలమండలి ఫిర్యాదులపై విశ్లేషణ జరిపామని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. స్పెషల్ డ్రైవ్ ప‌క‌డ్బందీగా అమలు చేసేందుకు నిర్వహించిన మూడేళ్ల విశ్లేషణపై రిజల్ట్ వివరించారు. ప్రధానంగా వినియోగదారుల ఇళ్లలో లీకేజీ, రోడ్లపై సీవరేజ్ ఓవర్ ఫ్లో సమస్యలు గుర్తించినట్లు తెలిపారు. రోజూ వచ్చే ఫిర్యాదుల్లో 60 శాతం ఇవే రావడంతో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.

Similar News

News January 5, 2025

HYD: విశ్వవిద్యాలయాల్లో రీసెర్చ్‌పై ఫోకస్..!

image

HYD నగరంలోని OU, JNTUH, జయశంకర్ యూనివర్సిటీ, IIITH, IITH, HCU యూనివర్సిటీలో రీసెర్చ్‌పై విశ్వవిద్యాలయాల ఫోకస్ పెట్టాయి. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నాయి. 2022-23 నుంచి ఇందుకు బాటలు పడ్డాయి. IITH-79.77 కోట్లు, HCU-65.09, IIITH-33.55, అగ్రికల్చర్ యూనివర్సిటీ-21.36, OU-24.75, JNTUH-28.83 కోట్ల సెర్చ్ గ్రాంట్లే ఇందుకు నిదర్శనం.

News January 5, 2025

HYD: రైతుద్రోహి సీఎం: కేటీఆర్

image

మాజీమంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై Xలో మండిపడ్డారు. అక్కరకు రాని ఇందిరమ్మ భరోసా, రైతు భరోసాలో ప్రభుత్వం రైతునే కాంగ్రెస్ మాయం చేసిందన్నారు. మొక్కిన ఒక్క పథకం ఇయ్యని కాంగ్రెస్.. మోసానికి మారు పేరని పేర్కొన్నారు. ఢోకాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కార్ అని రైతుద్రోహి సీఎం రేవంత్ అని రాసుకొచ్చారు.

News January 5, 2025

సైబరాబాద్‌ను సురక్షితంగా మార్చాలి: CP

image

ప్రజా సమస్యలను సమర్థంగా పరిష్కరించేలా ప్రమాణాలు రూపొందించాలని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మరింత ఉన్నత లక్ష్యాలను చేరుకోవడమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. ప్రజలు సురక్షితంగా నివసించే ప్రాంతంగా సైబరాబాద్‌ను మార్చాలన్నారు.