News March 25, 2025
GHMC మేయర్ కనిపించడం లేదని ఫిర్యాదు

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కనిపించడం లేదని మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. GHMC పరిధిలోని సమస్యలపై ఆమె శ్రద్ధ చూపడంలేదని కనీసం ఆమె కార్యాలయంలో కూడా అందుబాటులో ఉండటం లేదని శ్రవణ్ ఆరోపించారు. నగరంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ, మేయర్ వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
Similar News
News March 26, 2025
సంగారెడ్డి: వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వల్లూరు క్రాంతి హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలో వైద్యశాఖ పై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈసారి మాత శిశు మరణాల రేటు 50% తగ్గినట్లు చెప్పారు. ఆసుపత్రులకు వచ్చే రిస్కు కేసులు ఏరియా ఆసుపత్రిలో వైద్యం అందిన చూడాలని సూచించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి పాల్గొన్నారు.
News March 26, 2025
అల్లూరి జిల్లాలో పరీక్షలకు 101 మంది దూరం

అల్లూరిలో బుధవారం జరిగిన 10వ తరగతి ఫిజికల్ సైన్స్ పరీక్షకు 101 మంది గైర్హాజరు అయ్యారని DEO బ్రహ్మాజీరావు తెలిపారు. మొత్తం 11,606 మంది విద్యార్థులు రాయవలసి ఉండగా 11,505 మంది హాజరయ్యారని తెలిపారు. 99 శాతం హాజరు నమోదు అయ్యిందన్నారు. డుంబ్రిగూడ, హుకుంపేట మండలాల్లో 8 పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు.
News March 26, 2025
మందమర్రి: ‘మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి’

సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృత్తి శిక్షణ కోర్సులను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు స్వరూప రాణి అన్నారు. మందమర్రిలో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృత్తి శిక్షణ తరగతులను ఆమె బుధవారం సందర్శించారు. మహిళలు వృత్తి శిక్షణ కోర్సులను నేర్చుకొని తమ కాళ్ల మీద తాము నిలబడాలని, ఆర్థికంగా నిలదొక్కుకొని కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు.