News January 30, 2025
GHMC వార్షిక బడ్జెట్‌కు అమోదం

GHMC కౌన్సిల్ సమావేశంలో వార్షిక బడ్జెట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హాల్‌లో చర్చలేకుండానే 2025-26 వార్షిక బడ్జెట్‌ను ఆమోదించారు. అంతకుముందు ఆఫీస్‌లో హైడ్రామా నెలకొంది. భిక్షాటన చేస్తూ BJP కార్పొరేటర్లు, పోడియం వద్ద BRS కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. పోలీసులు భారీగా మోహరించి సభ్యులను అరెస్ట్ చేశారు. ఇటువంటి పరిస్థితుల నడుమ రూ. 8,440 కోట్ల వార్షిక బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
Similar News
News March 13, 2025
పాడేరు: ‘కవయిత్రి మొల్లమాంబ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి’

నేటి యువత, విద్యార్థిని, విద్యార్థులు కవయిత్రి మొల్లమాంబ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తి పొందాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో కవయిత్రి మొల్ల జయంతిని నిర్వహించారు. మొల్ల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం మొల్ల జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. రామాయణాన్ని సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా రచించారని కొనియాడారు.
News March 13, 2025
సంగారెడ్డి: పోలీస్ స్టేషన్‌లకు టెన్త్ ప్రశ్నాపత్రాలు: DEO

పదో తరగతి ప్రశ్నాపత్రాలను పోలీస్ స్టేషన్‌లకు పంపిస్తున్నామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. 16న పేపర్ 1, 19న పేపర్ 2 ప్రశ్నాపత్రాలు పోలీస్ స్టేషన్‌లకు చేరుకుంటాయని పేర్కొన్నారు. సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు డబుల్ బాక్స్ లాకర్లతో పోలీస్ స్టేషన్లకు ఆయా తేదీల్లో ఉదయం 10 గంటలకు చేరుకోవాలని సూచించారు.
News March 13, 2025
8 ఏళ్లలోపు పిల్లలు ఈ ఐస్‌క్రీమ్ తినొద్దు: UK సైంటిస్టులు

రంగులు కలిపే ముద్ద ఐస్‌లను పిల్లలు ఎంతో ఇష్టంగా సేవిస్తుంటారు. అయితే, గ్లిజరాల్ కలిగిన ఈ స్లష్ ఐస్‌ను 8ఏళ్ల లోపు చిన్నారులు తినడం ప్రమాదకరమని UK పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పరిశోధనలో పిల్లలు స్లషీ ఐస్ సేవించిన వెంటనే అస్వస్థతకు గురవడంతో అత్యవసర చికిత్స అందించాల్సి వచ్చిందని తెలిపారు. గ్లిజరాల్ వల్ల పిల్లలు స్పృహ కోల్పోతున్నారన్నారు. 8-11ఏళ్లలోపు పిల్లలు ఎప్పుడైనా ఒకటి తినొచ్చని సూచించారు.