News October 7, 2025
GHMC వ్యాప్తంగా ఓపెన్ జిమ్స్ ప్రారంభం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నూతనంగా 30కి పైగా ఓపెన్ జిమ్స్ ప్రారంభించినట్లుగా GHMC అధికారులు తెలియజేశారు. ప్రతి డివిజన్ పరిధిలో ఓపెన్ జిమ్స్ అందుబాటులో ఉన్నాయని, ప్రజలందరూ ఫిట్‌నెస్ కోసం వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మై జీహెచ్ఎంసీ యాప్, GHMC అధికారిక వెబ్‌సైట్‌లో వీటి వివరాలు పొందుపరిచినట్లుగా పేర్కొన్నారు.
Similar News
News October 7, 2025
HYD: లవ్ ఫెయిల్.. యువకుడి సూసైడ్

HYD మూసాపేటలో నిన్న <<17932066>>కమలేశ్ సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. మహారాష్ట్ర వాసి కమలేశ్ 3 నెలల క్రితం HYD వచ్చాడు. కాగా తన సొంతూరుకు చెందిన ఓ యువతిని కొన్నాళ్లుగా అతడు లవ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో చేతులను బ్లేడ్‌తో కోసుకున్న ఫొటోలను యువతికి వాట్సాప్‌లో పంపి, సెల్ఫీ వీడియో తీసుకుంటూ గదిలో ఉరేసుకున్నాడు. అయితే అతడి ప్రేమికురాలు సైతం సూసైడ్‌కు యత్నించినట్లు తెలుస్తోంది.
News October 7, 2025
HYD: జాతీయ పార్టీలు ఆలస్యమెందుకు..?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టూనే ఇప్పుడు తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. కాగా ప్రాంతీయ పార్టీ అయిన BRS అందరి కంటే ముందే అభ్యర్థిని ప్రకటించి క్షేత్రస్థాయిలో ప్రచారంలోకి దిగిందని, జాతీయ పార్టీలైనా కాంగ్రెస్, BJP మాత్రం ఇంకా ఆలస్యమెందుకు చేస్తున్నాయో అర్థంకావడం లేదని స్థానికంగా చర్చ సాగుతోంది. అయితే బలమైన అభ్యర్థుల కోసం అధిష్ఠానాలు చూస్తున్నాయని ఆయా పార్టీల నాయకులు చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్?
News October 7, 2025
ఈనెల 26న హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఎన్నికలు

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 26న క్లబ్ కార్యవర్గానికి ఎన్నికలు జరుగుతాయని ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రవికాంత్ రెడ్డి తెలిపారు. 2025-27 సంవత్సరానికి ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికలకు రిటర్నింగ్ ఆఫీసర్‌గా దొడ్డా శ్రీనివాస్ రెడ్డి వ్యవహరిస్తారన్నారు.