News November 20, 2025

GHMC స్టాండింగ్ కమిటీ మీటింగ్.. మూసాపేట్ కార్పొరేటర్ ARREST

image

GHMC స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో ఈరోజు ఉద్రిక్తత నెలకొంది. మూసాపేట్ డివిజన్‌కి రావాల్సిన నిధుల విషయంలో జాప్యం చేస్తున్నారని, డివిజన్‌లో మౌలిక సదుపాయాల కొరతపై అధికారులను నిలదీసినందుకు తనను అరెస్ట్ చేశారని మూసాపేట్ కార్పొరేటర్ కొడిచెర్ల మహేందర్ తెలిపారు. డివిజన్‌లో సమస్యలు పరిష్కరించేందుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తనను అక్రమంగా అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారని మండిపడ్డారు.

Similar News

News November 21, 2025

మహబూబాబాద్: నర్సింహులపేటలో విషాదం

image

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ఫకీరాతండా గ్రామ పంచాయతీ పరిధిలోని బొడ్డితండాకు చెందిన రైతు ఆంగోత్ భాను ఆకేరు వాగులో పడి మృతిచెందాడని స్థానికులు తెలిపారు. వ్యవసాయ భూములు ఆకేరు వాగు అవతల ఉండడంతో రైతు భాను బస్తాల టార్పాలిన్లను తీసుకొని వెళ్తున్న క్రమంలో కాలు జారీ వాగులోని కాలువ గుంతలో పడిపోయాడు. అతడిపై టార్పాలిన్లు పడడంతో ఊపిరాడక మృతిచెందాడు.

News November 21, 2025

విశాఖ ‘ఖాకీ’లపై ప్రత్యేక నిఘా..!(1/1)

image

రాష్ట్ర ఆర్థిక రాజధానిగా వృద్ధి చెందుతున్న విశాఖలో పలువురి <<18351380>>పోలీసుల తీరు<<>> చర్చకు దారి తీస్తోంది. సివిల్ సెటిల్మెంట్లు, రాజకీయ పైరవీలతో అంటకాగుతున్నారనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఇటీవల దువ్వాడలో రూ.కోట్ల విలువైన భూమి కోసం ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. లా అండ్ ఆర్ఢర్ కోణంలో ఈ ఇష్యూలో ఎంటరైన ఓ సీఐ సెటిల్మెంట్‌కు యత్నించటం ఉన్నతాధికారుల ద్రుష్టికి వెళ్ళింది. గతంలో ఆర్ఐ స్వర్ణలత ఇష్యూ సంచలనమైన సంగతి తెలిసిందే.

News November 21, 2025

విశాఖ ‘ఖాకీ’లపై ప్రత్యేక నిఘా..!(1/2)

image

విశాఖలో దీర్ఘకాలంగా పాతుకుపోయిన కొందరు పోలీసు అధికారులు ఇష్టారీతిన వ్యవహిస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో ఉన్నతాధికారులు అవినీతి పోలీసుల పనితీరుపై స్పెషల్ టీంతో నిఘా పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీపీ దృష్టిలో ఏ అధికారిపై రిమార్క్స్ ఎక్కువ వచ్చాయి? ఎవరి మీద యాక్షన్ ఉంటుంది? అన్న భయం ఖాకీల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టిస్తోంది. మీ పరిధిలో పోలీసులు పనితీరుపై కామెంట్ చెయ్యండి.