News October 3, 2024
ఘోరం: ఐదుగురు బిడ్డలున్నా అన్నం పెట్టట్లేదు

TG: కనిపెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బిడ్డలు కాదు పొమ్మన్నారు. దీంతో పోలీసులు వారి కడుపు నింపుతున్నారు. మహబూబ్‌నగర్(D) మాసన్‌పల్లికి చెందిన వెంకటయ్య, నరసమ్మ దంపతులకు నలుగురు ఆడపిల్లలు, ఓ కొడుకు. అందరికీ పెళ్లిళ్లు చేశారు. బిడ్డలు పట్టించుకోకపోవడంతో HYD రాజేంద్రనగర్‌లో ఓ బ్రిడ్జి కింద తలదాచుకుంటున్నారు. వారిని వృద్ధాశ్రమంలో చేరుస్తామని పోలీసులు తెలిపారు.
Similar News
News March 28, 2026
234 స్థానాల్లో 164 చోట్ల DMK పోటీ

TNలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయబోయే స్థానాలను అధికార పార్టీ DMK ప్రకటించింది. మొత్తం 234 స్థానాల్లో 164 చోట్ల బరిలోకి దిగుతున్నట్లు CM స్టాలిన్ తెలిపారు. మిగతా 70 చోట్ల తమ మిత్ర పక్షాలు పోటీలో నిలుస్తాయన్నారు. అందులో 28చోట్ల కాంగ్రెస్ బరిలోకి దిగుతుందని చెప్పారు. మిగతా స్థానాలను DMDK, VCK, CPI తదితర పార్టీలు పంచుకుంటాయని తెలిపారు. ఏప్రిల్ 23వ తేదీ TNలో ఎన్నికలు జరగనున్నాయి.
News March 28, 2026
ఇది మీ రాష్ట్రం కాదు, వెళ్లిపోవాలన్నారు: పవన్

AP: తన అన్నయ్యతో పాటు కుటుంబమంతా మద్రాసులో ఆస్తులన్నీ అమ్మేసుకొని హైదరాబాద్ వచ్చామని అమరావతికి చట్టబద్ధత చర్చ సందర్భంగా అసెంబ్లీలో Dy.CM పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ‘HYD వచ్చాకా అదే సమస్య. కారణాలేవైనా కావచ్చు. కానీ ఇది మీ ఊరు కాదు, మీ రాష్ట్రం కాదు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అన్నారు. రాష్ట్ర విభజన రాజకీయ పరమైన సమస్య అని అనుకునేవాడిని కానీ ప్రజలపైనా తీవ్ర ప్రభావం చూపింది’ అని తెలిపారు.
News March 28, 2026
రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం.. చెక్ చేసుకోండి!

పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించేందుకు కేంద్రం ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని అమలుచేస్తోంది. దీనిద్వారా అర్హులైన ప్రతి కుటుంబం ఏడాదికి రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం పొందవచ్చు. అయితే దీనికి అర్హులో కాదో చెక్ చేసుకొని అప్లై చేసుకోవాలని కేంద్రం సూచించింది. <


