News July 9, 2024
ఘోరం.. ప్రిన్సిపల్‌ను హత్య చేసిన ఇంటర్ విద్యార్థి

AP: ఒంగోలుకు చెందిన రాజేశ్ అస్సాంలో దారుణహత్యకు గురయ్యారు. రాజేశ్ అస్సాంలోని శివసాగర్‌లోని ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపల్, లెక్చరర్‌గా చేస్తున్నారు. 11వ తరగతి విద్యార్థికి కెమిస్ట్రీలో తక్కువ మార్కులు రావడంతో పాటు ప్రవర్తన బాలేదని మందలించారు. దీంతో ఆ విద్యార్థి కక్ష పెంచుకున్నాడు. సాయంత్రం ఆయన క్లాసు చెబుతున్న సమయంలో విద్యార్థి కత్తితో రాజేశ్‌పై దాడికి పాల్పడగా ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మరణించారు.
Similar News
News November 21, 2025
DWCWEOలో ఉద్యోగాలు

AP:బాపట్లలోని డిస్ట్రిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్& ఎంపవర్మెంట్ ఆఫీస్ 8 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 29 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంబీబీఎస్, ఇంటర్, బీఏ(సోషల్ వర్క్/సోషియాలజీ/సోషల్ సైన్సెస్), డిగ్రీ, బీఈడీ, 7వ తరగతి అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 25-42ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్సైట్: https://bapatla.ap.gov.in/
News November 21, 2025
అరటి రైతుల ఆక్రందనలు పట్టట్లేదా: షర్మిల

AP: అరటి రైతుల ఆక్రందనలు కూటమి ప్రభుత్వానికి పట్టకపోవడం సిగ్గుచేటు అని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల మండిపడ్డారు. అరటి టన్ను ధర రూ.28వేల నుంచి రూ.వెయ్యికి పడిపోయిందన్నారు. కిలో రూపాయికి అమ్ముకోలేక కష్టపడి పండించిన అరటిని పశువులకు మేతగా వేస్తుంటే రైతు సంక్షేమం ఎక్కడుంది? అని ఫైరయ్యారు. ప్రభుత్వం తక్షణమే రైతుల బాధలను వినాలని, టన్నుకు రూ.25వేలు గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు.
News November 21, 2025
రెండో టెస్టుకు గిల్ దూరం.. ముంబైకి పయనం

మెడనొప్పితో బాధపడుతున్న టీమ్ఇండియా టెస్ట్ కెప్టెన్ గిల్ సౌతాఫ్రికాతో జరగాల్సిన రెండో టెస్టుకు దూరమయ్యారు. ICUలో చికిత్స పొంది జట్టుతో పాటు గువాహటికి చేరుకున్న ఆయనకు ఇవాళ ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించారు. అందులో ఫెయిల్ కావడంతో జట్టు నుంచి రిలీజ్ చేశారు. కొద్దిసేపటి కిందటే గిల్ ముంబైకి పయనమయ్యారు. అక్కడ వైద్య నిపుణుల పర్యవేక్షణలో 3 రోజులు చికిత్స తీసుకోనున్నట్లు తెలుస్తోంది.


