News August 14, 2024
రాష్ట్రంలో మళ్లీ చంద్రన్న కానుకలు?

AP: రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు తిరిగి చంద్రన్న కానుకలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫాలను లబ్ధిదారులందరికీ ఉచితంగా ఇస్తారు. ఇందుకు ఏటా రూ.538 కోట్లు ఖర్చు కానుంది. ఐదేళ్లకుగానూ ప్రభుత్వంపై రూ.2,690 కోట్ల అదనపు భారం పడనుంది. చంద్రన్న సంక్రాంతి కానుక కింద గోధుమపిండి, శనగపప్పు, బెల్లం, కందిపప్పు, పామాయిల్, నెయ్యి అందజేస్తారు.
Similar News
News November 7, 2025
పెళ్లి ఏర్పాట్లలో రష్మిక!

విజయ్ దేవరకొండతో రష్మిక మంధాన వచ్చే ఏడాది వివాహ <<18217983>>బంధంలోకి <<>>అడుగు పెట్టనున్నట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఫేమస్ వెడ్డింగ్ డెస్టినేషన్ జైపూర్(రాజస్థాన్)లో పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో సరైన వేదిక కోసం రష్మిక 3 రోజులు అక్కడ పర్యటించినట్లు తెలుస్తోంది. జైపూర్లోని పలు రిసార్టులను పరిశీలించారని టాక్. త్వరలోనే వేదికను ఖరారు చేయనున్నట్లు సినీ వర్గాల ప్రచారం.
News November 7, 2025
అమరావతి నిర్మాణానికి ₹7,500 CR రుణం

AP: నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్(NaBFID) అమరావతి నిర్మాణానికి ₹7,500 CR రుణం మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన పత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారాయణ సమక్షంలో CRDA కమిషనర్ కన్నబాబుకు బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సామ్యూల్ జోసెఫ్ అందించారు.
News November 7, 2025
ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది కాంగ్రెస్సే: శ్రీధర్ బాబు

TG: ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జూబ్లీహిల్స్లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నికలో ఓటర్లు BJP, BRSకు గుణపాఠం చెబుతారన్నారు. తొమ్మిదేళ్లలో హైదరాబాద్ అభివృద్ధిని బీఆర్ఎస్ గాలికొదిలేసిందని విమర్శించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న నవీన్ యాదవ్ను గెలిపించాలని ఓటర్లను కోరారు.


