News November 20, 2024
గిగ్ వర్కర్స్ పాలసీని సమగ్రంగా మారుస్తాం: CM రేవంత్
TG: కుల సర్వేతో మిమ్మల్ని గర్వించేలా చేయడం మరింత శక్తినిస్తుందంటూ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ CM రేవంత్ ట్వీట్ చేశారు. ‘మీ ముందుచూపు, ఆలోచనలు, పని నుంచే మేం ప్రేరణ పొందాం. మీ వాగ్దానాలకు అనుగుణంగా TG గిగ్ వర్కర్స్ పాలసీని సమగ్రంగా, మార్గదర్శకంగా మారుస్తాం’ అని CM పేర్కొన్నారు. గిగ్ వర్కర్ల సంక్షేమానికి చర్యలు చేపట్టాలని రాహుల్ రాసిన లేఖకు స్పందనగా రేవంత్ ఈ ట్వీట్ చేశారు.
Similar News
News November 27, 2024
అభివృద్ధిని ఓర్వలేక కాకుల్లా అరుస్తున్నారు: భట్టి
TG: మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. పార్టీ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికే రూ.10 వేల కోట్ల కేటాయించామని, అభివృద్ధిని ఓర్వలేకే కొందరు కాకుల్లా అరుస్తున్నారని మండిపడ్డారు. పనిలేని విమర్శలతో ప్రతిపక్షాలకు ప్రయోజనం ఉండదన్నారు. మూసీ నిర్వాసితులకు వ్యాపార రుణాలు ఇస్తామని చిట్‌చాట్‌లో వెల్లడించారు.
News November 27, 2024
కారు కొంటున్నారా? ఈ విషయం తెలుసా?
ఇండియాలో కార్ల ధరలో సగం పన్నులే అని మీకు తెలుసా? GST 28%, సెస్ 17% ఎక్స్-షోరూం ధరలో కలిసి ఉంటాయి. ఆ తర్వాత రోడ్ ట్యాక్స్ 15-20%, ఇన్సూరెన్స్‌పై 18% జీఎస్టీ విధిస్తారు. కారు రేటు రూ.10 లక్షల కంటే ఎక్కువగా ఉంటే అదనంగా 1% TCS ఉంటుంది. ఉదాహరణకు ఓ కారు ఎక్స్-షోరూం ధర రూ.10 లక్షలు ఉంటే అందులో రూ.3.11 లక్షలు పన్నులే (28% జీఎస్టీ+17% సెస్) ఉంటాయి. ఆ తర్వాత రోడ్ ట్యాక్స్ కింద రూ.2 లక్షలు చెల్లించాలి.
News November 27, 2024
BJP ఎమ్మెల్యేపై చంద్రబాబు సీరియస్
AP: ఆర్టీపీపీ బూడిద తరలింపు వ్యవహారానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించొద్దని హితవు పలికారు. ‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కల్పిస్తే సహించను. ఈ ఘటనపై అధికారులు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలి. ఈ విషయంలో ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించాలి’ అని ఆయన ఆదేశించారు.