News January 7, 2025

గిల్‌కు అంత సీన్ లేదు: మాజీ సెలక్టర్

image

శుభ్‌మన్ గిల్ ఓ ఓవర్‌రేటెడ్ క్రికెటర్ అని, ఆయనకు భారత్ అన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని మాజీ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. ‘నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. నా మాట ఎవరూ వినలేదు. గిల్‌కు అంత సీన్ లేదు. అతడి బదులు సూర్యకుమార్, రుతురాజ్, సాయి సుదర్శన్ వంటి వారిని ప్రోత్సహించాలి. ప్రతిభావంతులకు బదులు గిల్‌కు ఛాన్సులిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News December 15, 2025

క్రమంగా పుంజుకుంటోన్న అరటి ధరలు

image

AP: గత నెలలో కిలో రూ.2కు పడిపోయిన అరటి ధరలు.. ఉత్తరాది వ్యాపారుల కొనుగోలుతో ఇప్పుడు పుంజుకుంటున్నాయి. ప్రస్తుతం కిలో అరటి ధర కనీసం రూ.10, గరిష్ఠంగా రూ.16, రూ.17గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో అరటి సాగు పెరగడం, తక్కువ ధరకే నాణ్యమైన అరటి లభించడంతో ఉత్తరాది వ్యాపారులు అక్కడి సరుకునే కొనడంతో.. ఏపీలో అరటి ధర భారీగా పతనమై ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలకు ఎగుమతి నిలిచింది.

News December 15, 2025

ఆగని పతనం.. ఆల్ టైమ్ కనిష్ఠానికి రూపాయి

image

రూపాయి పతనం ఆగడం లేదు. కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో పడిపోతోంది. తాజాగా మరోసారి ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయిని చేరుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 90.75కు చేరుకుంది. ఇవాళ ఒక్కరోజే 26 పైసలు పతనమైంది. అమెరికాతో ట్రేడ్ డీల్ ఆలస్యం, పెరుగుతున్న వాణిజ్య లోటు, డాలర్లకు డిమాండ్, భారత్‌పై US 50 శాతం టారిఫ్‌లు ఈ క్షీణతకు కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

News December 15, 2025

రాష్ట్రంలో 60 పోస్టులు. దరఖాస్తుకు కొన్ని గంటలే ఛాన్స్

image

<>తెలంగాణ<<>> స్టేట్ ఫొరెన్సిక్ సైన్స్ లాబోరేటరీలో 60 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళ సా. 5గంటల వరకే అవకాశం ఉంది. పోస్టును బట్టి ఇంటర్, BA, BSc, MSc, .M.Tech, MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, Lab టెక్నీషియన్, Lab అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ వీటిని భర్తీ చేయనుంది. వెబ్‌సైట్: www.tgprb.in