News February 12, 2025

అదరగొడుతున్న గిల్.. కోహ్లీ ఫిఫ్టీ

image

భారత బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో అదరగొడుతున్నారు. వరుసగా మూడు వన్డేల్లో 50+ స్కోర్ చేశారు. తొలి వన్డేలో 87, రెండో వన్డేలో 60 పరుగులు చేశారు. మూడో వన్డేలోనూ అర్ధసెంచరీతో కొనసాగుతున్నారు. మరోవైపు పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతోన్న కింగ్ కోహ్లీ(52) ఎట్టకేలకు హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యారు.

Similar News

News February 4, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News February 4, 2026

భారత GDP వృద్ధి 6.9%: గోల్డ్‌మన్ శాక్స్

image

ఇండియా-అమెరికా వాణిజ్య ఒప్పందం, భారత వస్తువులపై USA టారిఫ్‌ల తగ్గింపుతో.. పలు రేటింగ్ సంస్థలు మనదేశ వృద్ధి అంచనాలను సవరిస్తున్నాయి. ఈ ఏడాది భారత GDP వృద్ధిని 6.9 శాతంగా గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. ఇరుదేశాల వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే తక్కువ సుంకాలు అమలై, దేశ GDPలో సుమారు 0.2% వృద్ధి కనిపిస్తుందని వెల్లడించింది. వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గి ఆర్థిక పరిస్థితులకు మద్దతు లభిస్తుందని పేర్కొంది.

News February 4, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB 04, బుధవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.47 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.37 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.13 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.27 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.