News May 12, 2024
గిల్ కచ్చితంగా బాధపడుతూ ఉంటాడు: రవిశాస్త్రి

భారత T20WC జట్టులో యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కకపోవడంపై మాజీ కోచ్ రవిశాస్త్రి నిరాశ వ్యక్తం చేశారు. ‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలిగే సామర్థ్యం ఉన్న ప్లేయర్ గిల్. కానీ ఆ టాలెంటెడ్ క్రికెటర్‌కు జట్టులో చోటు దక్కలేదు. ఈ ఎదురుదెబ్బను జీర్ణించుకోవడం అతనికి కష్టంగా ఉంటుంది. కచ్చితంగా బాధపడుతూ ఉంటాడు. దీన్ని పాజిటివ్‌గా తీసుకుని మరింత మెరుగుపడేందుకు గిల్ ప్రయత్నించాలి’ అని సూచించారు.
Similar News
News November 28, 2025
నేషనల్ ఫొరెన్సిక్ సైన్సెస్ వర్సిటీలో ఉద్యోగాలు

<
News November 28, 2025
బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి మరో షాక్

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో షాక్ తగిలింది. మరో 3 అవినీతి కేసుల్లో ఆమెను దోషిగా తేల్చిన ఢాకా కోర్టు ఏడేళ్ల చొప్పున మొత్తం 21 సంవత్సరాల జైలు శిక్ష వేసింది. ఒక్కో కేసులో రూ.లక్ష జరిమానా చెల్లించాలని, లేకుంటే మరో 18 నెలలు జైలు శిక్ష పొడిగిస్తామని తీర్పునిచ్చింది. హసీనా కూతురు, కుమారుడిపై నమోదైన కేసుల్లో కోర్టు వారిద్దరికీ 5ఏళ్ల చొప్పున జైలు శిక్ష, ఒక్కో లక్ష ఫైన్ కట్టాలని తీర్పునిచ్చింది.
News November 28, 2025
చెక్క దువ్వెన వాడుతున్నారా?

జుట్టు ఆరోగ్యం కోసం ప్రస్తుతం చాలామంది చెక్క దువ్వెన వాడుతున్నారు. కానీ దీన్ని క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా పెరిగిపోతుంది. గోరువెచ్చని నీటిలో డిష్‌వాష్ లిక్విడ్/ షాంపూ, కొబ్బరి, ఆలివ్ నూనెలను కలపాలి. దువ్వెనను ఈ మిశ్రమంలో 2 నిమిషాలు ఉంచి బ్రష్‌తో రుద్దాలి. తర్వాత ఎండలో ఆరబెడితే సరిపోతుంది. నీటితో వద్దు అనుకుంటే నూనెను దువ్వెన మొత్తం పట్టించి ఓ అరగంటయ్యాక బ్రష్‌తో దువ్వెన పళ్లను శుభ్రం చేయాలి.


