News February 19, 2025
నం.1 ర్యాంకులో గిల్

వన్డేల్లో భారత స్టార్ ప్లేయర్ శుభ్మన్ గిల్ నం.1 ర్యాంకుకు చేరారు. ఇంగ్లండ్తో సిరీస్లో సత్తా చాటిన ఈ బ్యాటర్ 796 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచారు. పాక్ ప్లేయర్ బాబర్ (773P), రోహిత్ శర్మ (761P) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక టెస్టుల్లో ENG ప్లేయర్ రూట్, టీ20ల్లో ఆసీస్ బ్యాటర్ హెడ్ మొదటి స్థానాల్లో ఉన్నారు. టీమ్ ర్యాంకింగ్స్లో టెస్టుల్లో AUS, వన్డేలు, టీ20ల్లో భారత్ తొలి స్థానంలో ఉన్నాయి.
Similar News
News February 21, 2025
నేటి నుంచి శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు

AP: దక్షిణ కైలాసంగా పేరొందిన శ్రీకాళహస్తిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి మార్చి 6 వరకు వైభవంగా జరగనున్నాయి. ఇవాళ సాయంత్రం భక్త కన్నప్ప ధ్వజారోహణంతో ఉత్సవాలకు అర్చకులు అంకురార్పణ చేస్తారు. తర్వాత రోజుకొక వాహనాన్ని స్వామివారి సేవలకు వినియోగిస్తారు. ఉత్సవాలకు హాజరుకావాలని పలువురు సీఎంలు, ప్రముఖ హీరోలకు స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇప్పటికే ఆహ్వానపత్రికలు అందజేశారు.
News February 21, 2025
YS జగన్కు కేంద్ర బలగాలతో రక్షణ ఇవ్వండి.. PMకు మిథున్ లేఖ

AP: మాజీ సీఎం జగన్కు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ప్రధాని, హోంమంత్రికి వైసీసీ లోక్సభ పక్షనేత మిథున్రెడ్డి లేఖ రాశారు. జగన్ ప్రాణాలకు ముప్పు తెచ్చేలా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల గుంటూరు పర్యటనలో తీవ్ర భద్రతా వైఫల్యం తలెత్తిందని, ఆయన నివాసం వద్ద కూడా కొన్ని అనుమానాస్పద ఘటనలు జరిగాయన్నారు. వెంటనే ఆయనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు.
News February 21, 2025
‘విదేశీ వైద్యవిద్యకు NEET-UG అర్హత’ నిబంధన సరైనదే: సుప్రీం

విదేశాల్లో వైద్య విద్య అభ్యసించడానికి ముందుగా నీట్ యూజీలో అర్హత సాధించాలన్న నిబంధన సరైనదేనని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. 2018లో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఈ నిబంధనను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ నిబంధనను మార్చాలంటూ పలువురు విద్యార్థులు చేసిన విజ్ఞప్తులను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. చట్టంలోని సెక్షన్ 33 ప్రకారం ఆ నిబంధనను అమలు చేసే అధికారం MCIకి ఉందని స్పష్టం చేసింది.