News August 6, 2024

అన్ని ఫార్మాట్లకు గిల్ కెప్టెన్ అవుతారు: మాజీ కోచ్

image

టీమ్‌ఇండియా ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌పై భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ ప్రశంసలు కురిపించారు. అతనిలో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయని కొనియాడారు. వన్డేల్లో అదరగొడుతున్న గిల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అతను రోహిత్ వద్ద పాఠాలు నేర్చుకుంటున్నాడని అన్నారు. 2027 వన్డే WC తర్వాత అన్ని ఫార్మాట్లలో భారత కెప్టెన్‌గా గిల్ ఎంపికవుతారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Similar News

News November 17, 2025

1,260 ఉద్యోగాలు.. సెలక్షన్ లిస్ట్ విడుదల

image

TG: 1,260 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల లిస్టును మెడికల్&హెల్త్ సర్వీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు 24,045 మంది దరఖాస్తు చేయగా, 23,323 మంది పరీక్ష రాశారు. కాగా స్పోర్ట్స్ కోటా సెలక్షన్ లిస్టును సెపరేట్‌గా రిలీజ్ చేస్తామని MHSRB వెల్లడించింది. వికలాంగుల కోటాలో దరఖాస్తుదారులు లేకపోవడంతో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది.
ఫలితాల కోసం <>క్లిక్<<>> చేయండి.

News November 17, 2025

షేక్ హసీనాను దోషిగా తేల్చిన కోర్టు

image

బంగ్లాదేశ్ మాజీ PM షేక్ హసీనాను ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్(ICT) దోషిగా తేల్చింది. గతేడాది విద్యార్థుల ఆందోళనలను హింసాత్మకంగా అణచివేశారని, 1400 మంది చావుకు కారణమయ్యారని ఆమెతో పాటు మరో ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటిని విచారించిన ICT ఆధారాలను నిజమైనవిగా పరిగణించి దోషిగా తేల్చింది. ఆమెకు గరిష్ఠశిక్ష పడుతుందని పేర్కొంది. ఇవి తప్పుడు ఆరోపణలని, తీర్పును పట్టించుకోనని హసీనా అన్నారు.

News November 17, 2025

HYDలో పెరుగుతున్న విడాకుల కేసులు!

image

యువత చిన్న సమస్యలు, గొడవలకే విడాకులు తీసుకుంటోంది. ఈ కల్చర్ హైదరాబాద్‌లో పెరుగుతోంది. ఫ్యామిలీ కోర్టుల్లో ప్రతినెలా సుమారు 250 విడాకుల కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. 25 – 35 ఏళ్ల మధ్య ఉన్న జంటలు చిన్న కారణాలకే డివోర్స్ తీసుకుంటున్నట్లు సమాచారం. యువ జంటలు సహనం, సర్దుబాటు, కమ్యూనికేషన్‌కు ప్రాధాన్యత ఇచ్చి చిన్న సమస్యలకే కోర్టు మెట్లెక్కకుండా వివాహ బంధాన్ని కాపాడుకోవాలని నిపుణులు కోరుతున్నారు.