News July 23, 2024
గిల్ మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్ అవుతారు: మాజీ కోచ్

శుభ్మన్ గిల్ భారత్కు ఏదోరోజు 3 ఫార్మాట్లలోనూ కెప్టెన్ అవుతారని భారత మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ అభిప్రాయపడ్డారు. ‘ఐపీఎల్ అయినా, జింబాబ్వే టూర్ అయినా.. కెప్టెన్గా గిల్ అద్భుత ప్రదర్శన చేశారు. అతని బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంది. అందుకే BCCI వైస్ కెప్టెన్సీతో అదనపు బాధ్యతల్ని ఇచ్చింది. విరాట్, రోహిత్ తరహాలోనే గిల్ కెప్టెన్సీతో అత్యుత్తమంగా ఆడతారని అనుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
Similar News
News December 24, 2025
‘అమరావతి’ బిల్లుపై నేడు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం?

AP: అమరావతిని ఏపీ శాశ్వత రాజధానిగా గుర్తించే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇవాళ జరిగే కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 2014-2024 మధ్య HYD ఉమ్మడి రాజధానిగా ఉంది. దీంతో 2024 జూన్ 2 నుంచి AP రాజధానిగా అమరావతిని గుర్తించాలని ప్రభుత్వం కోరుతున్న విషయం తెలిసిందే.
News December 24, 2025
హాదీ హత్య వెనుక యూనస్ ప్రభుత్వం.. సోదరుడి ఆరోపణ

బంగ్లాదేశ్లో అల్లర్లకు కారణమైన ఉస్మాన్ హాదీ హత్యపై ఆయన సోదరుడు ఒమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలను అస్థిరపరిచేందుకు యూనస్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులే ఈ హత్య చేయించారని ఆరోపించారు. కాగా హాదీపై ఈ నెల 12న కాల్పులు జరగగా ఆయన సింగపూర్లో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే.
News December 24, 2025
వైభవ్ మరో సెంచరీ

విజయ్ హజారే ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ చెలరేగారు. బిహార్ తరఫున ఆడుతున్న అతను అరుణాచల్తో మ్యాచ్లో 36 బంతుల్లోనే సెంచరీ చేశారు. ఇందులో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం డబుల్ సెంచరీ దిశగా అతని ఇన్నింగ్స్ కొనసాగుతోంది.


