News August 10, 2024
బెల్లం రమ్ వచ్చేస్తోంది గురూ..

బెల్లంతో తయారు చేసిన మొట్టమొదటి దేశీయ ఒరిజినల్ రమ్ త్వరలో కర్ణాటక మార్కెట్‌లోకి విడుదలకానుంది. హులి (టైగర్) పేరుతో ఆగస్టు 15న రానున్న ఈ మైసూర్ స్పెషల్ బ్రాండ్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఇంట్లోని ముఖ్యమైన పదార్థాలను ఉపయోగించి తయారు చేసిన బెల్లం రమ్‌ను ప్రీమియం రమ్‌గా అభివృద్ధి చేశారు. 750ml బాటిల్ బేస్ ధర రూ.630 కాగా, పన్నులు కలుపుకొని రూ.2,800కి లభించనుంది.
Similar News
News March 5, 2026
సీఐఏను సంప్రదించిన ఇరాన్ ఇంటెలిజెన్స్?

మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్స్‌పై USతో చర్చలకు నో చెబుతున్నా అంతర్గతంగా ఇరాన్ ఇంటెలిజెన్స్ ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. US నిఘా సంస్థ సీఐఏతో చర్చలకు సుముఖత వ్యక్తం చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం తెలిపింది. ఇందుకు మరో దేశ స్పై ఏజెన్సీ మధ్యవర్తిత్వం వహిస్తోందని ఇరు దేశాల అధికారులు చెప్పినట్లు రిపోర్ట్ చెబుతోంది. అయితే తమ హైకమాండ్ ఎలా స్పందిస్తుందోనని ఏజెన్సీలు సందిగ్ధంలో ఉన్నట్లు పేర్కొంది.
News March 5, 2026
చాట్ GPTకి షాక్.. 25 లక్షల మంది యూజర్లు ఔట్!

చాట్ GPTకి యూజర్లు షాకిచ్చారు. 25 లక్షల మంది దాన్ని బాయ్‌కాట్ చేసినట్లు తెలుస్తోంది. అమెరికా రక్షణ శాఖలో ఏఐ మోడల్స్ వినియోగానికి OpenAI ఒప్పందం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. మిలిటరీ ఆపరేషన్లలో AI వినియోగానికి మద్దతు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సబ్‌స్క్రిప్షన్లు రద్దు చేసుకుంటున్నారు. బాయ్‌కాట్ చేస్తామని వెబ్‌సైట్(https://quitgpt.org/)లో సంతకాలు చేస్తున్నారు.
News March 5, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 5)

* 1901: సినీ నటుడు ఈలపాట రఘురామయ్య జననం
* 1917: తొలితరం సినీనటి కాంచనమాల జననం
* 1920: తెలుగు కవి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి జననం
* 1827: బ్యాటరీని కనుగొన్న ఇటలీ శాస్త్రవేత్త అలెస్సాండ్రో వోల్టా మరణం
* 1953: సోవియట్ యూనియన్ చీఫ్ స్టాలిన్ మరణం
* 2004: సినీ నటుడు కొంగర జగ్గయ్య మరణం (ఫొటోలో)
* 2013: సినీ నటి రాజసులోచన మరణం


