News April 3, 2024

IPL కాదు GIPL

image

దేశమంతా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ప్రతిరోజూ మ్యాచ్‌లతో ఫ్యాన్స్‌కు కావాల్సినంత వినోదం లభిస్తోంది. ఈ క్రమంలో ‘గ్రేట్ ఇండియన్స్ ప్రీమియర్ లీగ్’ అంటూ దేశంలోని ప్రముఖుల పేర్లతో క్రియేట్ చేసిన టీమ్‌ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అహింస టైటాన్స్, నెహ్రూ రాయల్స్, మిసైల్ సూపర్ కింగ్స్, భారత్ వారియర్స్ వంటి జట్లకు గాంధీ, నెహ్రూ, వాజ్‌పేయి, కలామ్ వంటివారు కెప్టెన్లుగా పలు AI ఫొటోలను సృష్టించారు.

Similar News

News January 9, 2026

ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమా: భట్టి

image

TG: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. ఇందుకోసం ప్రముఖ బ్యాంకర్లతో సంప్రదింపులు ముగిశాయన్నారు. ఇప్పటికే సింగరేణి, ట్రాన్స్‌కో, SPDCL, NPDCL, జెన్కో ఉద్యోగులకు రూ.కోటికి పైగా ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు చెప్పారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.

News January 9, 2026

అయోధ్యలో నాన్-వెజ్ ‌నిషేధం

image

అయోధ్య, పంచకోషీ యాత్ర రూట్లలో నాన్-వెజ్ అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్టు UP ప్రభుత్వం ప్రకటించింది. ఆధ్యాత్మిక ప్రాంతాల పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. హోటల్స్, రెస్టారెంట్లలో నాన్-వెజ్ పదార్థాల తయారీ, అమ్మకాలపై నిషేధం అమలులో ఉన్నప్పటికీ కొంతమంది టూరిస్టులు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుని తింటున్నారని ఆరోపణలున్నాయి. దీంతో ఆన్‌లైన్ డెలివరీలపైనా నిషేధం విధించింది.

News January 9, 2026

మాయమైపోతున్నారమ్మా.. హరిదాసులు, డూడూ బసవన్నలు

image

‘అయ్యవారికి దండంపెట్టు..అమ్మగారికి దండంపెట్టు’ అంటూ సంక్రాంతి సీజన్‌లో సందడి చేసే గంగిరెద్దుల కళాకారులు అంతరించిపోతున్నారు. ఒకప్పుడు సన్నాయి మేళాలు, అలంకరించిన బసవన్నలు, కుటుంబం, వంశాలను కీర్తిస్తూ పద్యాలు పాడే హరిదాసులు ఇంటింటికీ తిరుగుతూ సందడి చేసేవారు. తగ్గిన ఆదరణ, పెరిగిన ఖర్చులతో భవిష్యత్ తరాల మనుగడ కష్టమవుతుందనే కారణంతో పూర్వీకుల కళను వదిలి బరువెక్కిన హృదయంతో వలసబాట పడుతున్నారు.