News November 15, 2024
నేడు అన్నవరంలో గిరిప్రదక్షిణ వేడుక

AP: కార్తీక పౌర్ణమి సందర్భంగా కాకినాడ(D)లోని అన్నవరం సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షిణ వేడుక ఇవాళ జరగనుంది. లక్షన్నర మంది భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. ఉ.8 గంటలకు స్వామి, అమ్మవార్ల ఊరేగింపు, మ.2కు కొండ దిగువన సత్యరథం ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచే 9.2KM మేర గిరిప్రదక్షిణ జరగనుంది. భక్తులకు ఆహారం, పండ్లు, తాగునీరు, మజ్జిగ అందించేందుకు స్టాల్స్ సిద్ధం చేశారు.
Similar News
News February 12, 2026
పంచాయతీలకు మరో రూ.387 కోట్లు

TG: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఇటీవల రూ.259 కోట్లు <<19056099>>విడుదల<<>> చేసిన 15వ ఆర్థిక సంఘం తాజాగా మరో రూ.387 కోట్లను రిలీజ్ చేసింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం రూ.646 కోట్లను ఇచ్చినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది. ఇంకా రూ.2,400 కోట్ల నిధులు పెండింగులో ఉన్నాయని, వాటిని కూడా వెంటనే విడుదల చేయాలని మంత్రి సీతక్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
News February 12, 2026
బిల్డర్లకు సాయం తప్ప రెరాలు చేసేదేమీ లేదు: CJI

రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా)లపై SC కీలక వ్యాఖ్యలు చేసింది. డిఫాల్టర్లయ్యే బిల్డర్లకు సాయపడడం తప్ప అవేమీ చేయడం లేదని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. వీటిని రద్దు చేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. అసలు దీనిని ఎందుకు తీసుకొచ్చారో ప్రభుత్వాలు ఆలోచన చేయాలని సూచించారు. హిమాచల్ ప్రదేశ్ రెరా ఆఫీసును సిమ్లా నుంచి ధర్మశాలకు తరలించడానికి సంబంధించిన కేసులో చీఫ్ జస్టిస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
News February 12, 2026
ఆన్‌లైన్‌లో వేప పుల్లలు.. రూ.2వేల పైనే!

మన దగ్గర ఉచితంగా లభించే ఎన్నో ప్రొడక్ట్స్‌ను ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తుంటాం. అందులో ‘వేప పుల్ల’ ఒకటి. అమెజాన్ వంటి షాపింగ్ సైట్స్‌లో 20 పుల్లలకు రూ.160వరకు ఉంటోంది. అదే అమెరికా వంటి దేశాల్లో వీటిని రూ.2వేల వరకూ విక్రయిస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన జీవనశైలిలో భాగంగా చాలామంది వేపపుల్ల వైపు మళ్లుతున్నారట. వేపలోని సహజ సిద్ధమైన యాంటీ బాక్టీరియల్ గుణాలు చిగుళ్లను దృఢపరుస్తాయి.


