News February 21, 2025
స్కూల్‌కు వెళ్తూ గుండెపోటుతో బాలిక మృతి

TG: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు ఘటనలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కామారెడ్డి జిల్లా సింగరాయిపల్లికి చెందిన టెన్త్ విద్యార్థిని శ్రీనిధి(14) హార్ట్ అటాక్‌తో చనిపోయింది. కామారెడ్డిలో పెద్దనాన్న ఇంట్లో ఉండి చదువుకుంటున్న ఆమె నడుచుకుంటూ స్కూల్ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే టీచర్లు సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేసినా ఫలితం లేకపోయింది.
Similar News
News February 14, 2026
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 పోస్టులు.. అప్లై చేశారా?

పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5,138 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ అర్హత గలవారు FEB 24 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. వయసు 20- 28 ఏళ్ల మధ్య ఉండాలి(రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు). రాత పరీక్ష, DV ద్వారా ఎంపిక చేస్తారు. రూరల్, అర్బన్ ప్రాంతంలో నెలకు రూ.12,300, మెట్రో ప్రాంతంలో రూ.15000 చెల్లిస్తారు. సైట్: pnb.bank.in
News February 14, 2026
మహా శివరాత్రి పూజా విధానం..

ఉదయాన్నే స్నానమాచరించి, శుభ్రమైన వస్త్రాలు ధరించి శివలింగాన్ని అభిషేకించాలి. పాలు, తేనె, బిల్వదళాలతో పూజించి ‘ఓం నమః శివాయ’ మంత్రం జపించాలి. రోజంతా ఉపవాసం ఉండాలి. రాత్రిని 4 ప్రహారాలుగా విభజించి శివార్చన, జాగరణ చేయాలి. ఆలయ దర్శనం మరింత శుభం. మరుసటి రోజు ఉదయమే నిద్ర లేవాలి. స్నానం చేయాలి. దైవప్రసాదంతోనే ఉపవాస దీక్షను విరమించాలి. ఈ విధానం వల్ల ఆధ్యాత్మిక శుద్ధి, పరమేశ్వరుని కృప లభిస్తాయని నమ్మకం.
News February 14, 2026
జమాత్ గెలుపు… భారత్‌కు సమస్యేనా!

బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఇండియాను ఆనుకొని ఉన్న సరిహద్దు సీట్లలో పాక్ అనుకూల ‘జమాత్-ఏ-ఇస్లామీ’ గెలవడం ఆందోళనకరమని రిపబ్లిక్ TV వ్యాఖ్యానించింది. అది 68 స్థానాలు గెలవగా మన దేశ సరిహద్దు వెంబడి ఉన్న దాదాపు అన్ని సీట్లు ఆ పార్టీ ఖాతాలో ఉన్నాయంది. చికెన్ నెక్ కారిడార్, WB, మేఘాలయ, త్రిపుర, అస్సాంను ఆనుకొని ఉన్న సీట్లలో గెలిచిన జమాత్ భారత్ వ్యతిరేక రాడికలైజేషన్‌ను పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.


