News March 19, 2025

టిక్‌టాక్ రీల్ అనుకరిస్తూ కోమాలోకి బాలిక

image

టిక్‌టాక్ రీల్ అనుకరిస్తూ ఓ బాలిక కోమాలోకి వెళ్లింది. USలోని మిస్సోరి ఫెస్టస్‌కు చెందిన స్కార్లెట్ సెల్బీ(7) టిక్‌టాక్‌లో నీడో క్యూబ్‌ ఆకృతిని మార్చే రీల్ చూసింది. దాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని రీల్‌లో చూపించినట్లు ఆ క్యూబ్‌ను తొలుత ఫ్రీజ్ చేసి ఆపై ఒవెన్‌లో ఉంచింది. దానిని బయటికి తీసినప్పుడు క్యూబ్‌ పేలి, అందులోని వేడి ద్రవం ఆమె ముఖం, ఛాతిపై పడింది. కొంత నోరు, ముక్కులోకి చేరడంతో కోమాలోకి వెళ్లింది.

Similar News

News December 6, 2025

ఒక కాకి చనిపోతే మిగిలినవి ఎందుకు వస్తాయో తెలుసా?

image

సాధారణంగా ఒక కాకి చనిపోతే మిగిలినవి దాని చుట్టూ చేరి అరుస్తూ ఉంటాయి. కాకుల గుంపు కాకి మృతికి గల కారణాన్ని గమనించి.. ఆ ప్రాంతంలో ఉన్న ప్రమాదాన్ని అంచనా వేస్తాయి. ప్రమాదకరమైన మనిషి లేదా ప్రదేశాన్ని గుర్తుంచుకుని భవిష్యత్తులో జాగ్రత్త పడతాయి. సింపుల్‌గా చెప్పాలంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాయి. ఈ విధంగా తమ వంశాన్ని రక్షించుకుంటాయి. కాకి వస్తే ఎవరో చనిపోతారనేది మూఢనమ్మకం అని పరిశోధనలు చెబుతున్నాయి.

News December 6, 2025

త్వరలో హీరో సుశాంత్‌, హీరోయిన్ మీనాక్షి పెళ్లి? క్లారిటీ..

image

టాలీవుడ్ హీరో సుశాంత్, హీరోయిన్ మీనాక్షి చౌదరి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు SMలో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె టీమ్ ఖండించింది. ఇందులో నిజం లేదని, వారిద్దరూ ఫ్రెండ్స్ అని పేర్కొంది. ఏదైనా సమాచారం ఉంటే అఫీషియల్‌గా తామే ప్రకటిస్తామని తెలిపింది. కాగా సుశాంత్ హీరోగా నటించిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీతో మీనాక్షి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలోనూ వీరి పెళ్లిపై వార్తలు రాగా మీనాక్షి ఖండించారు.

News December 6, 2025

ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో భారీగా ఉద్యోగాలు

image

ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో 300 AO పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి డిగ్రీ/PG, MA(ఇంగ్లిష్, హిందీ) ఉత్తీర్ణులైన వారు ఈ నెల 15 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: orientalinsurance.org.in/ * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.