News September 23, 2024
బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారం

TG: మహబూబ్నగర్(D) దేవరకద్ర(మ)లో దారుణం జరిగింది. ఓ గ్రామానికి చెందిన బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిన్న బయటకు వచ్చిన బాలికను కిడ్నాప్ చేసిన ఆటోడ్రైవర్ పొలాల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టి అనంతరం వదిలిపెట్టాడు. ఇంటికొచ్చిన బాలిక కూలి పనులకు వెళ్లొచ్చిన తల్లికి విషయం చెప్పింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో నిందితుడిపై కేసు నమోదైంది. చికిత్స కోసం బాలికను ఆస్పత్రికి తరలించారు.
Similar News
News November 22, 2025
పంట మునిగినా, జంతువుల దాడిలో దెబ్బతిన్నా ఫసల్ బీమా

PM ఫసల్ బీమా యోజనలో ఇప్పటి వరకు కరవు, వడగళ్లు, తుఫాన్ల వల్ల పంట నష్టం జరిగితే బీమా చెల్లించేవారు. ఇక నుంచి దాని పరిధి పెంచారు. ఏనుగులు, అడవి పందులు, కోతులు వంటి జంతువుల వల్ల పంట నాశనమైతే ఇకపై బీమా వర్తిస్తుంది. భారీ వర్షాల వల్ల పొలాలు నీట మునిగి పంట కుళ్లిపోయినా, దెబ్బతిన్నా పరిహారం చెల్లిస్తారు. 2026 ఖరీఫ్ సీజన్ (జూన్-జులై) నుంచి ఇది అమల్లోకి వస్తుంది. 2025-26 ఖరీఫ్ సీజనుకు ఇది వర్తించదు.
News November 22, 2025
పంట దెబ్బతిన్న 72 గంటల్లోపు సమాచారం ఇవ్వాలి

జంతువుల దాడి, భారీ వర్షాలతో పొలాలు నీట మునిగి దెబ్బతింటే.. 72 గంటల్లోపు రైతులు వ్యవసాయ శాఖకు లేదా బీమా కంపెనీకి రైతులు సమాచారం అందించాలి. ‘క్రాప్ ఇన్సూరెన్స్ యాప్’లో నష్టపోయిన పంట ఫొటోలను జియో ట్యాగింగ్ చేసి అప్లోడ్ చేయాలి. ఏ జంతువుల వల్ల ఏ ఏ జిల్లాల్లో ఎక్కువ పంట నష్టం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి నోటిఫై చేయాలి. ఆ వివరాల ఆధారంగానే బీమా వర్తిస్తుందని కేంద్రం తెలిపింది.
News November 22, 2025
పెట్రోల్ ధరలు పెరుగుతాయా?

దేశంలో త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రష్యా నుంచి భారత్కు తక్కువ రేటుకు వస్తున్న ముడి చమురు దిగుమతులు తగ్గడమే ఇందుకు కారణమని సమాచారం. రష్యా ఆయిల్ సంస్థలపై అమెరికా విధిస్తున్న ఆంక్షలతో కొన్ని భారత కంపెనీలు ఇప్పటికే కొనుగోళ్లు ఆపేశాయి. US, పశ్చిమాసియా నుంచి వచ్చే ఆయిల్తో దిగుమతి ఖర్చు పెరగనుంది. దీంతో రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చని తెలుస్తోంది.


