News February 4, 2025

అమ్మాయిలూ.. జాగ్రత్త!

image

సోషల్ మీడియాలో పరిచయమవుతున్న అపరిచితులు స్నేహం పేరుతో నమ్మించి మోసం చేస్తున్నారని TSRTC సజ్జనార్ పేర్కొన్నారు. తెలియని వాళ్లతో చనువుగా ఉండి అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు పంచుకోవద్దని సూచించారు. ‘అజ్ఞాత వ్యక్తులతో స్నేహం పరిధి దాటి ముందుకు వెళితే మీకే నష్టం. మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో ఎవరిని పడితే వాళ్లని ఫాలో అవ్వడం, వారితో చాట్ చేయకండి’ అని యువతకు సందేశం ఇచ్చారు.

Similar News

News February 4, 2025

రేపు మహాకుంభమేళాకు ప్రధాని మోదీ

image

ప్రధాని మోదీ రేపు(FEB 5) ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు త్రివేణి సంగమం వద్ద ఆయన పవిత్ర స్నానం చేసి గంగామాతకు ప్రత్యేక పూజలు చేస్తారని ప్రధాని కార్యాలయం తెలిపింది. అటు రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మహాకుంభమేళాకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

News February 4, 2025

భారతీయులకు మొబైల్ వ్యసనంగా మారిందా?

image

పై ప్రశ్నకు సెన్సార్ టవర్స్ రిపోర్ట్ అవుననే సమాధానం చెబుతోంది. దాని ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్ స్క్రీన్ వినియోగంలో భారత్ తొలిస్థానంలో ఉంది. 2024లో భారత్ ఏకంగా 1.12 ట్రిలియన్ల గంటలు మొబైల్ ఫోన్లో గడిపిందని రిపోర్ట్ తెలిపింది. మనదేశంలో ఆన్‌లైన్ స్క్రీన్ వినియోగంలో 13% వృద్ధి కనిపిస్తే, అమెరికాలో 0.6% తగ్గింది. దీంతో ఓ టైమ్ నిర్దేశించుకొని మొబైల్ చూడాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

News February 4, 2025

తల్లి బతికుండగానే పెద్దకర్మ భోజనాలు.. ఎందుకంటే?

image

AP: తల్లి బతికుండగానే కుమారులు పెద్దకర్మ భోజనాలు పెట్టిన ఘటన కృష్ణా(D) పెడన(M) ముచ్చర్లలో జరిగింది. రంగమ్మ(80) తన ఆస్తిని కుమారులకు రాసేశారు. చనిపోయాక కొడుకులు పెద్దకర్మ భోజనాలు పెడతారో? లేదో? అని డౌట్ వచ్చింది. దీంతో బతికుండగానే ఆ కార్యక్రమం చేయాలని కుమారులను ఆమె కోరింది. తొలుత వారు షాక్‌కు గురైనా, ఆమె ఒత్తిడితో చివరకు బంధువులు, గ్రామస్థులను పిలిచి భోజనాలు వడ్డించారు. దీంతో రంగమ్మ సంతోషించారు.

error: Content is protected !!